మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పుడు వీరంతా ఎన్టీఆర్ బర్త్డే కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు..మే నెలలో సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుతో పాటూ తారక్ పుట్టినరోజు కూడా ఉంది.మే నెల వస్తే తమ అభిమాన హీరోని రెండు సార్లు చూడొచ్చని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశపడతారు.. ఎన్టీఆర్ బర్త్ డే రోజున హైదరాబాద్‌లోనే ఉంటే తన ఇంటిపైకి వచ్చి ఫ్యాన్స్ కు అభివాదం చేస్తారు.అలాగే తన తాత ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ ఘాట్ కు వస్తారు… అలా రెండుసార్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని స్పెషల్ గా కలుస్తారు..వీటితో పాటు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు తాను నటిస్తున్న లేటెస్ట్ సినిమాల నుంచి ఏదొక అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఉంటాడు.
ఇంకా 100 రోజులే..తలైవా ‘కూలీ’ వచ్చేస్తుంది..!!
ఈసారి కూడా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కోసం బర్త్ డే సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో రెండు భారీ సినిమాలు వున్నాయి…బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్2 తో పాటూ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా వుంది.. ప్రశాంత్ నీల్ సినిమా రీసెంట్ గానే మొదలైంది. ఈ రెండు సినిమాల నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కు విషెస్ తెలియచేస్తూ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్-నీల్ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ ను ఆల్రెడీ సిద్ధం చేశారట. టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ తో పాటూ చిన్న వీడియో గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.వార్2 సినిమా నుంచి కూడా ఎన్టీఆర్ బర్త్ డే కు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది