MOVIE NEWS

జక్కన్నతో తారక్ మరో క్రేజీ మూవీ.. ఈ సారి అంతకుమించి..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ క్రేజీ కాంబోలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమాపై నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది… ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం. 1, యమదొంగ, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కి సంచలన విజయం సాధించాయి..ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించింది..ఆర్ఆర్ఆర్ సినిమాతో సరికొత్త రికార్డ్స్ సృష్టించిన ఈ క్రేజీ కాంబో తాజాగా మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి సరికొత్త జానర్ లో వీరి సినిమా ఉండనుందని సమాచారం.

బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!!

ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ ను నిర్మించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం…. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్‌ తో ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుందట.. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక మూవీని బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా దాదాసాబ్ ఫాల్కె గుర్తింపు పొందారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ బయోపిక్ లో తారక్‌ దాదాసాహెబ్ ఫాల్కే గా నటించనున్నారని తెలుస్తోంది. ఈమేరకు బాలీవుడ్‌ మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతున్నాయి.

దాదాసాహెబ్ జీవితం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. దీంతో ఆయన కథను నేటి తరానికి అందించాలన్న ఉద్దేశంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తారక్ అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెళ్తుందని అందుకే ఆయన్ను హీరోగా పెట్టి తీయాలని అనుకుంటున్నట్లు సమాచారం.త్వరలోనే షూటింగ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

Related posts

ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!!

murali

Pushpa 2: జాన్వీ కపూర్, త్రిప్తి దిమ్రీ అన్నారు కానీ ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో ఆ బ్లాక్ బస్టర్ హీరోయిన్….

filmybowl

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న పుష్పరాజ్..భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..!

murali

Leave a Comment