MOVIE NEWS

తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.. ఛాన్నాళ్లకు నాగచైతన్య తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సైతం సాధించింది.. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ మూడో వారంలోకి అడుగుపెట్టాక  కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి.. ఈ తరుణంలో సెకండాఫ్ లో ఉండాల్సిన ఒక ముఖ్యమైన పాటను వద్దనుకోవడం గురించి దర్శకుడు చందూ మొండేటి ఒక తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయం తెలిపారు.

ఓదెల 2 : శివశక్తి అవతారంలో తమన్నా.. టీజర్ అదిరిందిగా..!!

చైతుతో పాటు మొత్తం ఇరవై రెండు మంది పాకిస్థాన్ జైలుకు వెళ్ళాక అక్కడ జరిగే సంఘటనలతో పాటు ఇక్కడ సముద్రం ఒడ్డున వాళ్ళ కుటుంబాలు పడే కష్టాలను సమానతరంగా చూపించేలా ఒక పాటను కంపోజ్ చేయించాము… సాయిపల్లవి తాను దూరంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినదు నేనేం చేయాలనే పాయింట్ కూడా నాగచైతన్యతో చెప్పించారు.ఇవన్నీ ఫైనల్ వెర్షన్ లో రాలేదు. అందులో తండేల్ థీమ్ ని దాచుకున్న అసలైన సాంగ్ ఇలా ఎడిటింగ్ లో వెళ్లిపోవడం పట్ల ఫ్యాన్స్ కాస్త విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చందూ మొండేటి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ వద్దని చెప్పడం వల్లే ఆగిపోయామని, బన్నీ వాస్ తదితరులు ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు కానీ ఓటిటిలోనూ ఇది జోడించే అవకాశం లేదని తెలిపారు..అయితే ఈ సినిమాలోని పాకిస్థాన్ ఎపిసోడ్స్ పై ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందన వచ్చింది.అక్కడ మళ్ళీ ఇంకో పాట పెడితే నిడివి పెరిగి ల్యాగ్ అనిపించే ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఉండటం వల్ల ఆ సాంగ్ ఎడిట్ చేసినట్లు సమాచారం.

Related posts

మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..?

murali

“ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

అల్లు vs మెగా : పుష్ప 2 బెన్ఫిట్ షోస్ పై సరికొత్త పంచాయితీ..!!

murali

Leave a Comment