MOVIE NEWS

కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీస్ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకేక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీస్ ఫిబ్రవరి 7 న రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది…గత కొంత కాలంగా నాగచైతన్య వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. తండేల్ మూవీతో చైతూ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు..

ఆ బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో చరణ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ..?

ఈ సినిమా శ్రీకాకుళం మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ కథ ఆధారంగా తెరకెక్కింది..నిజంగా జరిగిన కథను దర్శకుడు చందూ మొండేటి ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది.. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ కోసం మళ్ళీ మళ్ళీ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు చాలా మంది వున్నారు..లవ్ సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ ఎంతో కొత్తగా ఉంటుంది.. ఈ సినిమాతో దేవిశ్రీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే తండేల్ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది..

ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ అదరగొట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..వాలంటైన్స్ వీక్ కావడంతో ఈ సినిమాకు జోరుగా కలెక్షన్స్ వచ్చాయి.. టోటల్ రన్ లో మరింత భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది..నాగచైతన్య కెరీర్ లో తండేల్ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది..

 

Related posts

గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!!

murali

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ఆరు సినిమాలు అప్డేట్స్ తో రెడీ !

filmybowl

‘కల్కి’ పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..!!

murali

Leave a Comment