MOVIE NEWS

తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా …

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”..కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈసినిమా  గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.నాగ చైతన్య గత ఏడాది నటించిన “కస్టడీ” మూవీ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా నాగచైతన్యకు మరో డిజాస్టర్ ని మిగిల్చింది.నాగచైతన్య కు గత కొంతకాలంగా సాలిడ్ హిట్ అనేది లేదు.దీంతో ” తండేల్” సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.

కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి.గతంలో చందు మొండేటి ,నాగ చైతన్య కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కి రెండు మంచి విజయం సాధించాయి.దీనితో వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ “తండేల్”కూడా మంచి విజయం సాధింస్తుందని మేకర్స్ ధీమాగా వున్నారు.శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం.

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కి రంగం సిద్ధం ..ఇక మాస్ జాతరే ..!!

తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.ఇప్పటికే మేకర్స్ తండేల్ నుంచి టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. అలాగే సాయి పల్లవి, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న మరో ప్యూర్ లవ్ స్టోరీగా “తండేల్” ఉండనుందని తెలుస్తుంది. గతంలో వచ్చిన టీజర్ చివర్లో బుజ్జితల్లి వచ్చేస్తున్నానే.. కూసింత నవ్వవే.. అని సాయి పల్లవి నవ్వుతో వచ్చిన వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా తండేల్ సినిమా నుంచి మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పాటను శ్రీమణి రాయగా, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..సింగర్ జావేద్ అలీ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట వైరల్ గా మారింది. ఈ సాంగ్ లో చైతన్య, సాయి పల్లవి పాత్రల మధ్య ప్రేమను మేకర్స్ అద్భుతంగా చూపించారు.

Related posts

ప్రభాస్ మొదటి సినిమా కథ ఇదే

filmybowl

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..?

murali

గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..?

murali

Leave a Comment