#shankar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/shankar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 12 Jul 2025 17:36:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #shankar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/shankar/ 32 32 మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..? https://filmybowl.com/telugu/shankar-is-ready-for-another-big-project-will-he-find-a-producer/ https://filmybowl.com/telugu/shankar-is-ready-for-another-big-project-will-he-find-a-producer/#respond Sat, 12 Jul 2025 17:36:10 +0000 https://filmybowl.com/telugu/?p=4231 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకప్పుడు ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్ గా శంకర్ కు తిరుగులేని పాపులారిటీ వుంది.వరుస సినిమాలతో శంకర్ భారీ హిట్స్ సాధించి చాలా మంది దర్శకులకు ఆదర్శంగా నిలిచారు.. కానీ ప్రస్తుతం శంకర్ మూవీస్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వడం లేదు.. పాత రొట్ట కథలతోనే శంకర్ సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోతున్నాయి.. ఇదిలా ఉంటే...

The post మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకప్పుడు ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్ గా శంకర్ కు తిరుగులేని పాపులారిటీ వుంది.వరుస సినిమాలతో శంకర్ భారీ హిట్స్ సాధించి చాలా మంది దర్శకులకు ఆదర్శంగా నిలిచారు.. కానీ ప్రస్తుతం శంకర్ మూవీస్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వడం లేదు.. పాత రొట్ట కథలతోనే శంకర్ సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోతున్నాయి.. ఇదిలా ఉంటే దర్శకుడు శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు.

AA22: నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..!!

అయితే గతంలో రోబో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పుడు వేల్పరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని శంకర్ అన్నారు.. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరూ ముందుకు రావడం లేదు..ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ గా నిలిచింది.ఆ మూవీ చూసిన తర్వాత దిల్ రాజుకు టెన్షన్ పెరిగింది. దిల్ రాజు అనుకున్నట్టే గేమ్ ఛేంజర్ కూడా ప్లాప్ అయింది. దిల్ రాజుకి భారీ లాస్ వచ్చింది… శంకర్ సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ తో కూడి ఉంటాయి

ముందు అనుకున్న బడ్జెట్ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి డబుల్ అయిపోతుంది. పైగా ఏళ్లకు ఏళ్లు షూటింగ్ లు సాగుతూనే ఉంటుంది. సినిమా హిట్ అయితే బడ్జెట్ కి రెట్టింపు లాభాలు వస్తాయి.. ఒకవేళ ప్లాప్ అయితే మాత్రం నిర్మాత అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. ఈ విషయాలు తెలిసిన తర్వాత శంకర్ డ్రీమ్ ప్రాజెక్టును నిర్మించే మరో ప్రొడ్యూసర్ దొరుకుతాడా అన్నదే ప్రశ్నగా మారింది . శంకర్ హిట్ చూసి చాలా కాలం అయింది.. వేల్పరిని మూడు పార్టులుగా తీస్తానని శంకర్ తెలిపారు. మొదటి పార్ట్ లో పాత్రల ఇంట్రడక్షన్ ఎక్కువగా ఉంటుంది. కథ పూర్తిగా చెప్పడం కుదరదు. అలాంటప్పుడు మొదటి పార్టు మొదలు పెడితే అది హిట్ అయినా కాకున్నా రెండో పార్టుకు వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇది నిర్మాతకు పెను భారమని చెప్పొచ్చు..శంకర్ మళ్ళీ వింటేజ్ డైరెక్టర్ గా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడితే తప్ప నిర్మాతలు దైర్యం చేయలేరు..

The post మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/shankar-is-ready-for-another-big-project-will-he-find-a-producer/feed/ 0
‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/ https://filmybowl.com/telugu/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/#respond Tue, 18 Mar 2025 08:45:10 +0000 https://filmybowl.com/telugu/?p=3190 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ...

The post ‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు.. కానీ దిల్ రాజుకి ఈ సినిమా భారీగా నష్టాలు మిగిల్చింది.. రిలీజ్ కి ముందు భారీ హైప్ వున్న ఈ సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి.. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.. అలాగే శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2 ‘దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కూడా గేమ్ ఛేంజర్ పై పడింది..ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు.

ఆ పాత్ర చూసి ఈర్ష్య తో అద్దం పగలగొట్టా.. శివాజీ షాకింగ్ కామెంట్స్..!!

అయితే శంకర్ ప్రతీ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు.. శంకర్ స్టోరీ నేరేషన్ కి తగ్గట్టు రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తారు.. అయితే ఈ సినిమా సమయంలో రెహమాన్ వేరే సినిమాలలో బిజీగా ఉండటం పైగా తెలుగు సినిమా కావడంతో తమన్ అయితే బాగుంటుంది అని అంతా రెఫెర్ చేయడంతో శంకర్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.. గతంలో శంకర్ తీసిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.. కానీ గేమ్ ఛేంజర్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు..

తాజాగా ఈ విషయం పై తమన్ స్పందించాడు..గేమ్ ఛేంజర్ సాంగ్స్ కి యూట్యూబ్ లో పెద్దగా వ్యూస్ రాలేదు..దీనికి గల కారణం తమన్ వివరించారు..ఈ సినిమాలో నా సాంగ్స్ తగ్గట్టు హుక్ స్టెప్స్ లేవు.. గతంలో వచ్చిన “ అల వైకుంఠపురం” సినిమాలో సాంగ్స్ కి అంత క్రేజ్ రావడానికి అందులో ప్రతీ పాటకి హుక్ స్టెప్ ఉంటుందని తమన్ తెలిపారు..మ్యూజిక్ విషయంలో సాంగ్స్ కి కేవలం 50 మిలియన్ వ్యూస్ వస్తాయి.. మిగిలిన వ్యూస్ రావడానికి కొరియోగ్రాఫర్స్ కష్టం వుంటుందని తమన్ తెలిపారు..

 

The post ‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/this-is-why-game-changer-songs-didnt-become-hits-thamans-shocking-comments/feed/ 0
ఆ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్.. వర్కౌట్ అవుతుందా..? https://filmybowl.com/telugu/shankar-who-is-planning-a-big-movie-with-that-star-hero-will-he-work-out/ https://filmybowl.com/telugu/shankar-who-is-planning-a-big-movie-with-that-star-hero-will-he-work-out/#respond Thu, 27 Feb 2025 12:29:58 +0000 https://filmybowl.com/telugu/?p=2833 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ విజయం సాధించాయి.ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు.కానీ ఇప్పుడు శంకర్ పరిస్థితి దారుణంగా మారింది.. తాజాగా ఆయన తెరకెక్కించిన రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.. దీనితో శంకర్...

The post ఆ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్.. వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ విజయం సాధించాయి.ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు.కానీ ఇప్పుడు శంకర్ పరిస్థితి దారుణంగా మారింది.. తాజాగా ఆయన తెరకెక్కించిన రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.. దీనితో శంకర్ ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.శంకర్ స్క్రీన్ ప్లే, పేలవమైన స్టోరీల పట్ల భారీ ట్రోల్స్ వచ్చాయి. అయితే శంకర్ ప్రస్తుతం  ఇండియన్ 3 పూర్తి చేసే పని లో వున్నారు.. ఈ సినిమా తరువాత శంకర్ ఎలాంటి సినిమా చేస్తాడనేది ప్రశ్నగా మారింది..

బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..?

అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్ల సమయంలో శంకర్ తన తదుపరి చిత్రం వేల్పూరి నవల ఆధారంగా ఉంటుందని వెల్లడించారు. కానీ ఆ సినిమా ఎవరితో అన్నది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు తన కొత్త మూవీ.. వేల్పూరి నవల ఆధారంగా స్టార్ హీరో అజిత్ తో వర్క్ చేయాలని శంకర్ అనుకుంటున్నట్లు సమాచారం..కానీ దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం అజిత్.. ఫారిన్ లో ఉన్న విషయం తెలిసిందే. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ కాంపిటీషన్ లో ఆయన పాల్గొంటున్నారు. దీంతో ఆయన ఇండియా వచ్చిన వెంటనే శంకర్ అజిత్ తో ఆ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గురించి చర్చించనున్నట్లు సమాచారం…

అయితే శంకర్ కు అజిత్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.అజిత్ “పట్టుదల” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశపరిచారు. త్వరలో అజిత్ మరో బిగ్గెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించింది

The post ఆ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్.. వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/shankar-who-is-planning-a-big-movie-with-that-star-hero-will-he-work-out/feed/ 0
ఇండియన్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..వర్కౌట్ అవుతుందా..? https://filmybowl.com/telugu/the-makers-key-decision-regarding-the-release-of-indian-3-will-it-work-out/ https://filmybowl.com/telugu/the-makers-key-decision-regarding-the-release-of-indian-3-will-it-work-out/#respond Fri, 14 Feb 2025 15:42:39 +0000 https://filmybowl.com/telugu/?p=2598 తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఇప్పుడంతగా కలిసి రావట్లేదని చెప్పాలి.. గతంలో భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన శంకర్ ఇప్పుడు మరీ పేలవమైన కథలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. రజనీకాంత్ నటించిన “2.O” సినిమా నుంచి శంకర్ డౌన్ ఫాల్ మొదలయింది.. రోబో రేంజ్ లో “2.O” సినిమా లేకపోవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాకు కమర్షియల్ సక్సెస్ లభించలేదు..దీనితో శంకర్ తన తరువాత సినిమాను...

The post ఇండియన్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఇప్పుడంతగా కలిసి రావట్లేదని చెప్పాలి.. గతంలో భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన శంకర్ ఇప్పుడు మరీ పేలవమైన కథలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. రజనీకాంత్ నటించిన “2.O” సినిమా నుంచి శంకర్ డౌన్ ఫాల్ మొదలయింది.. రోబో రేంజ్ లో “2.O” సినిమా లేకపోవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాకు కమర్షియల్ సక్సెస్ లభించలేదు..దీనితో శంకర్ తన తరువాత సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ తో మొదలు పెట్టాడు.. 28 ఏళ్ల క్రితం వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” కి సీక్వెల్ గా ఇండియన్ 2 ని శంకర్ మొదలు పెట్టాడు.. భారీ తారాగనంతో భారీ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది..

ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే.. క్లారిటీ వచ్చేసినట్లేనా..?

దీనితో శంకర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథతో తెలుగులో స్ట్రైట్ సినిమా చేసేందుకు ప్రయత్నించాడు.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో శంకర్ మూవీని సెట్ చేసాడు.. అలా తెరకెక్కిన సినిమానే “గేమ్ ఛేంజర్”.. ఈ సినిమా మొదలెట్టిన కొంత కాలానికే ఇండియన్ 2 ప్రొడ్యూసర్స్ తమ సినిమాను ముందు పూర్తి చేయాలనీ న్యాయ పరంగా వెళ్లడంతో దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను హోల్డ్ లో పెట్టి ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసాడు..

కానీ ఇండియన్2 సినిమా దారుణంగా ప్లాప్ అయింది.. ఒక పార్ట్ గా తెరకెక్కించాల్సిన సినిమాను అనవసర సన్నివేశాలతో రెండు పార్టులుగా విభజించడంతో ఇండియన్ పార్ట్ 2 సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. అసలు కథ అంత ఇండియన్ 3 లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇండియన్ 2 ప్లాప్ తో డీలా పడ్డ శంకర్ గేమ్ ఛేంజర్ తో అయినా సక్సెస్ అందుకుంటాడు అనుకుంటే ఆ సినిమా సైతం డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో శంకర్ ప్రస్తుతం ఇండియన్ 3 పై దృష్టి పెట్టాడు.. ఈ సినిమాను ముందుగా ఓటిటిలో రిలీజ్ చేయాలను కున్నారు.. కానీ అది కుదరలేదు.. దీనితో కమల్ నటిస్తున్న మణిరత్నం మూవీ ’‘థగ్ లైఫ్ “ రిలీజ్ అయ్యాక ఈ సినిమా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఆ సినిమా ఊపులోనే ఈ సినిమా సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు..

 

The post ఇండియన్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-makers-key-decision-regarding-the-release-of-indian-3-will-it-work-out/feed/ 0
ఓటీటీలో సైతం ‘గేమ్ ఛేంజర్’ కు నిరాశే మిగిలిందిగా..!! https://filmybowl.com/telugu/even-on-ott-game-changer-remains-a-disappointment/ https://filmybowl.com/telugu/even-on-ott-game-changer-remains-a-disappointment/#respond Sun, 09 Feb 2025 13:19:38 +0000 https://filmybowl.com/telugu/?p=2494 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఛాన్నాళ్లకు సోలో హీరోగా రాంచరణ్ నుంచి సినిమా రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు..కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే...

The post ఓటీటీలో సైతం ‘గేమ్ ఛేంజర్’ కు నిరాశే మిగిలిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఛాన్నాళ్లకు సోలో హీరోగా రాంచరణ్ నుంచి సినిమా రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు..కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే డిజాస్టర్ టాక్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొంతకాలంగా పేళవమైన సినిమాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఇండియన్ 2 సైతం దారుణంగా ప్లాప్ అయింది..కనీసం రాంచరణ్ సినిమాతోనైనా ఫామ్ లోకి వస్తాడు అనుకుంటే గేమ్ ఛేంజర్ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది..ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు 450కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాడు..దిల్ రాజుకి ఈ సినిమా ఫలితం నిరాశనే మిగిల్చింది.. భారీగా నష్టాలు వచ్చాయి..

కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..?

కానీ అదే సంక్రాంతికి వచ్చిన “ సంక్రాంతికి వస్తున్నాం “ సినిమా దిల్ రాజుని సేఫ్ సైడ్ లో పడేసింది.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి దిల్ రాజుకి మంచి లాభాలు తీసుకొచ్చింది..ఇదిలా ఉంటే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఫిబ్రవరి 7న ఓటీటీ లోకి వచ్చింది. అయితే ఓటీటీలో కూడా ఈ మూవీకి ప్రేక్షకుల నుండి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు..

ఓటీటీ రిలీజ్ అయ్యి రెండు రోజులు అయినా ఇండియాలో ట్రెండింగ్‌ లిస్ట్ టాప్ 10లో ‘గేమ్ ఛేంజర్’నిలువలేకపోయింది.ఓటీటీ రిలీజ్‌కి ముందే ఆన్‌లైన్‌లో HD పైరసీ ప్రింట్ విడుదల కావడంతో దీన్ని ప్రైమ్ వీడియోలో చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనితో ఓటీటీలో కూడా గేమ్ ఛేంజర్ ప్రేక్షకాదరణ లభించలేదు..

 

The post ఓటీటీలో సైతం ‘గేమ్ ఛేంజర్’ కు నిరాశే మిగిలిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/even-on-ott-game-changer-remains-a-disappointment/feed/ 0
ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/ https://filmybowl.com/telugu/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/#respond Wed, 22 Jan 2025 10:52:33 +0000 https://filmybowl.com/telugu/?p=2164 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్...

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది..దీనితో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు…

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..?

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది.., ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కింది..ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే మిక్స్‌డ్ టాక్‌కు తోడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సినిమాను చంపోద్దని విజ్ఞప్తి చేశారంటే ఈ సినిమా పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి టఫ్ సిట్యువేషన్ లో సైతం ఈ సినిమా ఇప్పటి వరకు రూ.130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది..

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ కోసం ఓటీటీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది..తెలుగు సహా అన్ని భాషలు కలిపి గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ. 104 కోట్లకు చేజిక్కించుకుందట. నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. దీనిని బట్టి గేమ్ ఛేంజర్ ఫిబ్రవరి 14 లేదా 15వ తేదీల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం..

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/feed/ 0
గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!! https://filmybowl.com/telugu/telangana-government-gave-a-shock-to-the-game-changer/ https://filmybowl.com/telugu/telangana-government-gave-a-shock-to-the-game-changer/#respond Sat, 11 Jan 2025 16:53:17 +0000 https://filmybowl.com/telugu/?p=2053 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తుంది… ఫస్డ్ డే గేమ్ ఛేంజర్ సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల...

The post గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తుంది… ఫస్డ్ డే గేమ్ ఛేంజర్ సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హెయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

రాజమౌళి మూవీ కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్..!!

ఛాన్నాలకు రాంచరణ్ నటించిన సోలో సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాపై ఎంత క్రేజ్ వుందో చెప్పొచ్చు..ఇది ఇలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా స్పెషల్‌ షోలను రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో రేపటి నుంచి తెలంగాణాలో గేమ్ ఛేంజర్ మార్నింగ్‌ స్పెషల్‌ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్‌ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెనిఫిట్‌ షోలను రద్దు చేసి స్పెషల్‌ షోలకు మాత్రం అనుమతి ఇవ్వడాన్ని కోర్టు తప్పుపట్టింది. దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని సూచించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్‌ షోలను రద్దు చేసినట్లు సమాచారం

The post గేమ్ ఛేంజర్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/telangana-government-gave-a-shock-to-the-game-changer/feed/ 0
గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! https://filmybowl.com/telugu/game-changer-piracy-issue-dil-raju-is-cringing/ https://filmybowl.com/telugu/game-changer-piracy-issue-dil-raju-is-cringing/#respond Sat, 11 Jan 2025 13:25:03 +0000 https://filmybowl.com/telugu/?p=2040 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం దాదాపు మూడేళ్ళగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..ఇన్నేళ్ల వారి నిరీక్షణను తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం...

The post గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం దాదాపు మూడేళ్ళగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..ఇన్నేళ్ల వారి నిరీక్షణను తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం లేకపోవడం తో
ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిరాశకి గురయ్యారు.

డైరెక్టర్ శంకర్ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు ఏంటి అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలిసి ఉంటుంది..అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా 500 కోట్లు వరకు కలెక్ట్ చేయాలి.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా కేవలం 300 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..?

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే గేమ్ ఛేంజర్ కి సంబంధించిన HD ప్రింట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసేసారు. ఈ ప్రింట్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్నారు..అసలే సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందని నిర్మాత దిల్ రాజు దిగులు పడుతుంటే ఈ పైరసీ ఇష్యూ ఆయన్ని మరింతగా బాధపెడుతుంది..ఆశ్చర్యం ఏమిటంటే పైరసీ చేసిన వారిపై మూవీ టీం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు..

సోషల్ మీడియా లో ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో దిల్ రాజుకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం వుంది.. దర్శకుడు శంకర్ ని బాగా నమ్మిన మూలంగా దిల్ రాజుకి భారీ నష్టం తప్పేలా లేదు..

The post గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-piracy-issue-dil-raju-is-cringing/feed/ 0
గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..? https://filmybowl.com/telugu/game-changer-shankar-misses-clarity-for-length-will-you-add-more-scenes/ https://filmybowl.com/telugu/game-changer-shankar-misses-clarity-for-length-will-you-add-more-scenes/#respond Sat, 11 Jan 2025 08:34:59 +0000 https://filmybowl.com/telugu/?p=2026 గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. “గేమ్ ఛేంజర్” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి ఇవ్వడంతో గేమ్ ఛేంజర్ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..జనవరి 10 అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి మొదలైంది..5 ఏళ్ళ తర్వాత చరణ్ సోలో హీరోగా రూపొందిన...

The post గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. “గేమ్ ఛేంజర్” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి ఇవ్వడంతో గేమ్ ఛేంజర్ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..జనవరి 10 అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి మొదలైంది..5 ఏళ్ళ తర్వాత చరణ్ సోలో హీరోగా రూపొందిన సినిమా కావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు..అయితే ఈ సినిమా మొదటి షో కి మిక్స్డ్ టాక్ వచ్చింది.ఊహించినంత రేంజ్ లో గేమ్ ఛేంజర్ సినిమా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అలాగే ఇంకొంతమంది ఈ సినిమా చాలా రొటీన్ గా ఉందని అంటున్నారు.మరికొంతమంది అయితే ‘ఇండియన్ 2’ సినిమా కంటే కాస్త బెటర్ గానే వుంది అంటున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

మార్నింగ్ షోలతో పోలిస్తే మధ్యాహ్నం షోలకు టాక్ కాస్త ఇంప్రూవ్ అయ్యింది.దీనితో “గేమ్ ఛేంజర్ సినిమాకుఅబౌవ్ యావరేజ్ రెస్పాన్స్ లభించింది.‘పుష్ప 2’ రేంజ్లో చరణ్ గేమ్ ఛేంజర్ అయితే లేదు. మొదటి నుండి ఈ సినిమా రెండు పార్ట్స్ లో వస్తుందని అంతా అనుకున్నా ఒకే పార్ట్ గా దర్శకుడు శంకర్ రిలీజ్ చేసారు.సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్న, పార్వతీలకు కొడుకు ఉన్నట్టు చూపించారు. అలాగే పార్వతీ ప్రెగ్నెంట్ అని కూడా చూపించారు.అప్పన్న మర్డర్ అయ్యాక.. తర్వాత ఆమె ఏమైంది? ఆమె కొడుకు ఏమయ్యాడు? అనే ప్రశ్నలకు దర్శకుడు శంకర్ సమాధానాలు ఇవ్వలేదు.

అలాగే పార్వతీ పాత్రని చూసి షాక్ అయిన సత్యమూర్తి(శ్రీకాంత్).. తండ్రి అప్పన్న పోలికలతో ఉన్న రామ్ నందన్ ను చూసి ఎందుకు షాక్ అవ్వలేదు. తర్వాత అతనికే ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చాడు..వంటి పలు ప్రశ్నలకు దర్శకుడు శంకర్ సమాధానాలు ఇవ్వలేదు.ఈ సంక్రాంతికి ‘నానా హైరానా’ సాంగ్ తో పాటు మరికొన్ని సన్నివేశాలు ఏమైనా యాడ్ చేసి క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి..

The post గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-shankar-misses-clarity-for-length-will-you-add-more-scenes/feed/ 0
భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/ https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/#respond Thu, 09 Jan 2025 13:35:25 +0000 https://filmybowl.com/telugu/?p=2018 స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు..శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ ను కూడా ఉంటుంది.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్...

The post భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు..శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ ను కూడా ఉంటుంది.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ తో వరుస భారీ సూపర్ హిట్స్ అందించిన ఘనత శంకర్ కే దక్కుతుంది.. సినిమాకు రిచ్ నెస్ పరిచయం చేసింది కూడా దర్శకుడు శంకరే..

అన్ ప్రిడిక్టబుల్ సాంగ్ వచ్చేసింది.. సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో..?

సినిమాను ఎంత గ్రాండ్ గా, అద్భుతమైన విజువల్స్ తెరకెక్కిస్తే ఆ సినిమాకు అంత వాల్యూ ఉంటుందని దర్శకుడు శంకర్ అప్పట్లోనే గ్రహించారు.. అద్భుతమైన గ్రాఫిక్స్, గ్రాండియర్ విజువల్స్ శంకర్ సినిమా రీతినే మార్చేసారు..ఆయన తెరకెక్కించిన సినిమాలలో హీరో పాత్ర చాలా బలంగా ఉంటుంది.. సినిమా చూసే ప్రేక్షకులని ఆద్యంతం కథతో కనెక్ట్ చేయగల సత్తా వున్న ఏకైక దర్శకుడు శంకర్.. అయితే ప్రస్తుతం శంకర్ సినిమాలలో రిచ్ నెస్ వున్నా ప్రేక్షకులకు పాత శంకర్ మ్యాజిక్ మిస్ అవుతుంది.. రీసెంట్ గా శంకర్’భారతీయుడు-2′ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ మూవీ ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రజనీకాంత్ గొప్ప వ్యక్తి. ఈ విషయం ఎంతో మందికి తెలుసు. నాకు ప్రస్తుతానికి బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచన అయితే లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే కనుక కచ్చితంగా రజనీ కాంత్ బయోపిక్‌నే తీస్తాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

The post భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/a-biopic-of-that-hero-will-be-made-in-the-future-shankars-interesting-comments/feed/ 0