Rana daggubati Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rana-daggubati/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 03 Feb 2025 15:38:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Rana daggubati Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rana-daggubati/ 32 32 రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/ https://filmybowl.com/telugu/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/#respond Mon, 03 Feb 2025 15:37:24 +0000 https://filmybowl.com/telugu/?p=2390 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఈ సంక్రాంతి పండుగకి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఇదిలా ఉంటే గతంలో రానా దగ్గుబాటి,విక్టరీ వెంకటేష్ కలిసి ‘రానా నాయుడు’అనే బోల్డ్ వెబ్‌సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే…...

The post రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఈ సంక్రాంతి పండుగకి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఇదిలా ఉంటే గతంలో రానా దగ్గుబాటి,విక్టరీ వెంకటేష్ కలిసి ‘రానా నాయుడు’అనే బోల్డ్ వెబ్‌సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే… అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయి రికార్డ్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.

కన్నప్ప : ప్రభాస్ లుక్ పై సూపర్ ట్రోలింగ్..లుక్ కూడా కాపీనేనా..?

ఈ సిరీస్ లో వెంకీ, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. అయితే ‘రానా నాయుడు’ సిరీస్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి… ఇందులో వచ్చే కొన్ని సీన్స్ మరీ బోల్డ్‌గా ఉండటంతో దారుణంగా నెగటివ్ ట్రోలింగ్ జరిగింది.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంతటి చెత్త సిరీస్ లో నటించాడా అని చాలా మంది కామెంట్స్ చేసారు..

నెగటివ్ ట్రోలింగ్ ఎంత వచ్చినప్పటికి ‘రానా నాయుడు’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపింది. అయితే మూవీ లవర్స్ అంతా ఈ సిరీస్‌కు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఇదిలా ఉంటే ఇటీవల ఈ బోల్డ్ సిరీస్ కి సీజన్-2 రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు.. ఇదిలా ఉంటే.. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ రానా నాయుడు సిరీస్ లవర్స్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘రానా నాయుడు-2’ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో విలన్‌గా నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తుండగా.. కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో సీజన్ 2 తెరకెక్కుతోంది. అయితేఈ టీజర్ మధ్యలో ‘కొన్ని యుద్ధాలు కొనసాగుతాయి.. కొత్తవి ప్రారంభమవుతాయి” అంటూ మేకర్స్ ‘రానా నాయుడు-2’ బాగా హైప్ పెంచారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు..

 

The post రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/feed/ 0