#pushpa raj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/pushpa-raj/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 28 Dec 2024 08:32:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #pushpa raj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/pushpa-raj/ 32 32 డాకు మహారాజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పుష్ప రాజ్..? https://filmybowl.com/telugu/pushpa-raj-as-guest-for-daku-maharaj-event/ https://filmybowl.com/telugu/pushpa-raj-as-guest-for-daku-maharaj-event/#respond Sat, 28 Dec 2024 08:32:12 +0000 https://filmybowl.com/telugu/?p=1723 నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”డాకు మహారాజ్”.స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ భారీ మాస్ అండ్ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది.ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది…’డాకు మహారాజ్’ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు....

The post డాకు మహారాజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పుష్ప రాజ్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”డాకు మహారాజ్”.స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ భారీ మాస్ అండ్ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది.ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది…’డాకు మహారాజ్’ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘దేవర’ నచ్చలేదు.. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ కామెంట్స్..?

ఈ చిత్రంలో బాలయ్య ఇంతకముందెన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.., శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెలా,చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో స్టైలిష్ విలన్ పాత్ర పోషిస్తున్నారు…స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి స్టార్ హీరో అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ గ్రాండ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో భారీ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో అల్లు అర్జున్ పెద్దగా బయటకు రావడం మానేశారు.. ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ చనిపోవడం, దీని కారణంగా బన్నీ అరెస్ట్ కావడం జరిగింది.. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బన్నీ మళ్ళీ పబ్లిక్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయం పై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

The post డాకు మహారాజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పుష్ప రాజ్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-raj-as-guest-for-daku-maharaj-event/feed/ 0