ntr devara Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ntr-devara/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 25 Sep 2024 18:24:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg ntr devara Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ntr-devara/ 32 32 దేవర రికార్డుల ఊచకోత మొదలు https://filmybowl.com/telugu/the-record-hunt-begins-devara-impact-on-box-office/ https://filmybowl.com/telugu/the-record-hunt-begins-devara-impact-on-box-office/#respond Wed, 25 Sep 2024 06:26:03 +0000 https://filmybowl.com/telugu/?p=360 NTR – Devara : ఏదైనా సినిమా బాగా ఆడుతుంటే డ్రీం రన్ అంటారు. కలెక్షన్స్ అనుకున్న దానికంటే కలెక్ట్ చేస్తుంటే బ్లాక్ బస్టర్ అంటారు అస్సలు షో పడకముందే , ఇంకా రెండు రోజులు టైం ఉండగానే పెట్టిన డబ్బుల్లో థియేట్రికల్ రన్ నుంచి 50 – 60 శాతం వెనక్కి వచ్చేస్తే దేవరుడి ఊచకోత అనడం లో తప్పు లేదేమో 6 ఏళ్ళ విరామమో (No Solo...

The post దేవర రికార్డుల ఊచకోత మొదలు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
The Record Hunt Begins: Devara Impact on Box Office
The Record Hunt Begins: Devara Impact on Box Office

NTR – Devara :

ఏదైనా సినిమా బాగా ఆడుతుంటే డ్రీం రన్ అంటారు.
కలెక్షన్స్ అనుకున్న దానికంటే కలెక్ట్ చేస్తుంటే బ్లాక్ బస్టర్ అంటారు

అస్సలు షో పడకముందే , ఇంకా రెండు రోజులు టైం ఉండగానే
పెట్టిన డబ్బుల్లో థియేట్రికల్ రన్ నుంచి 50 – 60 శాతం వెనక్కి వచ్చేస్తే దేవరుడి ఊచకోత అనడం లో తప్పు లేదేమో

6 ఏళ్ళ విరామమో (No Solo hero cinema), లేదా ముందు సినిమా మీద వచ్చిన సైడ్ హీరో అనే కామెంట్స్ తెలీదు గాని NTR అభిమానుల్లో కసి కనిపిస్తుంది

వాళ్ళ హీరో దేంట్లోను తక్కువ కాదు అని నిరూపించడానికి సిద్ధం అయ్యారు . దానికి తగ్గట్టు గానే రిలీజ్ ఐన ట్రైలర్స్ , సాంగ్స్ ఎక్సపెక్టషన్స్ ని పెంచేసాయి.

ఏదైనా షో పెట్టి పెట్టక ముందే హౌస్ ఫుల్ అవుతుంది.

ఇది ఒక చోట కాదు అమలాపురం నుంచి అరబిక్ కంట్రీస్ దాక,

సీమ నుంచి సిలికాన్ వాలీ దాక
సీఈడెడ్ నుంచి కెనడా దాక ప్రతి చోట దేవరుడి తాండవమే కనిపిస్తుంది

Read Also : https://filmybowl.com/telugu/film-new-highlighting-devara-iconic-scenes-and-moments-explained/

షో పడక ముందే వరల్డ్ వైడ్ గా దేవర ఇప్పటి వరకు 60 కోట్లు అడ్వాన్స్ కలెక్షన్స్ కొల్లగొట్టింది అంటే దేవరుడి ప్రభంజనం ఎలా ఉంటుందో ఊహకి అందట్లేదని ట్రేడ్ వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి

దర్శకుడి కొరటాల ముందు సినిమా డిసాస్టర్ ఐన ఆ ఛాయలు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ , హైప్ మీద పడకపోడం NTR రేంజ్ ని తెలియచేస్తుంది

రిలీజ్ ఐన తర్వాత ఒక చిన్న పాజిటివ్ టాక్ దేవరుడి ఆట ని ఆపలేదు
NTR కి మొదటి 1000 కోట్ల సినిమా ఐన ఆశ్చర్యపోవక్కర్లేదు

Follow us on Instagram

The post దేవర రికార్డుల ఊచకోత మొదలు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-record-hunt-begins-devara-impact-on-box-office/feed/ 0
దేవర ని హైలెట్ చేయనున్న సీన్స్ ఏంటి ? https://filmybowl.com/telugu/film-new-highlighting-devara-iconic-scenes-and-moments-explained/ https://filmybowl.com/telugu/film-new-highlighting-devara-iconic-scenes-and-moments-explained/#respond Tue, 24 Sep 2024 10:35:18 +0000 https://filmybowl.com/telugu/?p=337 దేవర సినిమాకి హైలైట్ ఏంటి అంటే అందరూ చెప్పే మాట ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ కి తొడుగ మాస్ డైరెక్టర్ కొరటాల, నేషన్స్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, అతిలోక సుందరి కూతురు జాన్వీ మొదటి సారి తెలుగు స్క్రీన్ మీద మెస్మరైజ్ చేయబోతున్నారు ఇవన్నీ కాకుండా ఇంకేంట!!!! సరే పదండి ఒక లుక్ వేద్దాం 1. కుస్తీ పోటీ – మల్ల యుద్ధం ఇవన్నీ తెలుగోడి బాగా ఇష్టమైన నేపథ్యం...

The post దేవర ని హైలెట్ చేయనున్న సీన్స్ ఏంటి ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Highlighting Devara: Iconic Scenes and Moments Explained
Highlighting Devara: Iconic Scenes and Moments Explained

దేవర సినిమాకి హైలైట్ ఏంటి అంటే అందరూ చెప్పే మాట ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ కి తొడుగ మాస్ డైరెక్టర్ కొరటాల, నేషన్స్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, అతిలోక సుందరి కూతురు జాన్వీ మొదటి సారి తెలుగు స్క్రీన్ మీద మెస్మరైజ్ చేయబోతున్నారు

ఇవన్నీ కాకుండా ఇంకేంట!!!! సరే పదండి ఒక లుక్ వేద్దాం

1. కుస్తీ పోటీ – మల్ల యుద్ధం
ఇవన్నీ తెలుగోడి బాగా ఇష్టమైన నేపథ్యం

అలంటి నేపధ్యాన్ని ఈ సినిమా లో ముఖ్య సన్నివేశం దగ్గర దర్శకుడు కొరటాల చిత్రీకరించాడని సమాచారం
ఎన్టీఆర్ – సైఫ్ మధ్య వచ్చే ఈ సన్నివేశం అదిరిపోయిందని టాక్

2. అండర్ వాటర్ సీక్వెన్స్

ఈ సినిమా లో ఎక్కువగా మాట్లాడుకున్న ఎపిసోడ్ ఇదే
ఎన్టీఆర్ మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను , తన టీం ఎంతగా కష్టపడింది
ఆ ఎండ తీవ్రతలో చేసిన అండర్ వాటర్ సీక్వెన్స్ ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతి మిగులుస్తుంది అనడం లో సందేహం లేదు అంటున్నారు

3. హాఫ్ మూన్ సీ ఫైట్

దేవర టీజర్ రిలీజ్ అయినప్పుడు అందరూ మాట్లాడుకున్న మరొక సీక్వెన్స్

దేవా ప్రత్యర్థులతో యుద్ధం ఎంత భీకరంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం

తన కత్తి పదును , తన చేతి ఆవేశం రెండు కలిపి చంద్రుడిని కూడా ఎరుపెక్కించాడు

ఈ సీన్ సినిమా కి మేజర్ హైలైట్ అవనుంది

4. ఆయుధ పూజ – ఫెస్టివల్ సాంగ్

ఈ ఆలోచనే మనలో ఒకరకమైన ఉద్వేగాన్ని తీసుకొస్తది. తెలుగు సాంప్రదాయం , ఆచారం , అలాగే ఎన్టీఆర్ లో వెన్నంటి వుండే మాస్ ఈ పాటని ప్రేక్షకుడి ముందు ప్రత్యేకంగా నిలబెట్టనుంది

Also Read : https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-responds-to-coolie-footage-leak-controversy/

5. కనపడని మరో ఎన్టీఆర్

ఇప్పటిదాకా దేవర టీం వదిలిన పోస్టర్స్ అన్ని దేవా, వర యంగ్ ఏజ్ లో వుండే స్టిల్స్ మాత్రమే వదిలి పెద్ద వయసులో వున్నా దేవాని మాత్రం దాచిపెట్టారు

ఆ దేవా ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరం
సినిమాని మలుపు తిప్పే సీన్ లో ఆ పెద్ద వయసున్న దేవా వస్తాడని తెలుస్తుంది

ఆ దేవా ఎంట్రీ కి , అనిరుద్ మాస్ మ్యూజిక్ తోడైతే సినిమా ప్రేక్షకుడికి సినిమాటిక్ హై తధ్యం

6. దేవర సాంగ్స్

ఇప్పటికే విడుదలైన దేవర పాటలు అటు మాస్ ని , ఇటు యూత్ ని , ముఖ్యంగా చుట్టమల్లె పాట ప్లేలిస్ట్ ని కబ్జా చేసింది అంటే అతిశయోక్తి కాదు.

ఇక ఆ పాటలు తెరపై ఎలా ఉంటాయి అనేది అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది

పైన చెప్పిన అన్నీ ఒకే సినిమా లో కుదరడం ఎన్టీఆర్ లాంటి హీరో తోడవడం తో దేవర సినిమాకి ఆకాశమే హద్దు అన్నట్టుంది

దానితో పాటు ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు

https://x.com/FilmyBowl/status/1837498808256942123

The post దేవర ని హైలెట్ చేయనున్న సీన్స్ ఏంటి ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/film-new-highlighting-devara-iconic-scenes-and-moments-explained/feed/ 0
దేవర ప్రీ-రిచ్లీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నలుగురు ఐకానిక్ దర్శకులు స్టేజీ పంచుకోబోతున్నారు. https://filmybowl.com/telugu/devara-pre-release-event-four-legendary-directors-to-join-jr-ntr-on-stage/ https://filmybowl.com/telugu/devara-pre-release-event-four-legendary-directors-to-join-jr-ntr-on-stage/#respond Fri, 20 Sep 2024 06:55:45 +0000 https://filmybowl.com/telugu/?p=275 జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం సెప్టెంబర్ 22 విడుదలకు ముందు జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఒక స్టార్-స్టడ్డెడ్ కార్యక్రమంగా మలుచుకోనుంది. ఈ ఈవెంట్‌లో నలుగురు ప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు—ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్—జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవర ప్రీరిలీజ్ స్టేజీ పంచుకోబోతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి – ది గేమ్ చేంజెర్బాహుబలి మరియు RRR లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రాల క్రియేటర్ ఎస్.ఎస్....

The post దేవర ప్రీ-రిచ్లీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నలుగురు ఐకానిక్ దర్శకులు స్టేజీ పంచుకోబోతున్నారు. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>

జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం సెప్టెంబర్ 22 విడుదలకు ముందు జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఒక స్టార్-స్టడ్డెడ్ కార్యక్రమంగా మలుచుకోనుంది. ఈ ఈవెంట్‌లో నలుగురు ప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు—ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్—జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవర ప్రీరిలీజ్ స్టేజీ పంచుకోబోతున్నారు.

ఎస్.ఎస్. రాజమౌళి – ది గేమ్ చేంజెర్
బాహుబలి మరియు RRR లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రాల క్రియేటర్ ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన దర్శకుల్లో ఒకరు. RRR చిత్రంలో వారి సహకారం తెలుగు సినిమాపై మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా బలమైన ముద్ర వేసింది. ఈ దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళిని చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ – ది విజనరీ
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రేరణాత్మక డైలాగ్స్ మరియు బలమైన కథనానికి పెట్టింది పేరు త్రివిక్రమ్. వారి ప్రాజెక్ట్ ఇంకా కంఫర్మ్ కాలేదు, కానీ ఈ ఇద్దరి కలయికలో మూవీ ఆశించి ఉన్న అభిమానులకు, దేవర ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ రావడం తో అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది.

Read Also : https://filmybowl.com/telugu/2024/09/20/sandeep-reddy-vanga-plans-massive-%e2%82%b9500-crore-budget-for-prabhass-spirit/

కొరటాల శివ – ప్రస్తుత దర్శకుడు
దేవరలో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రస్తుతం పనిచేస్తున్న కొరటాల శివ, గతంలో కూడా ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేసి జనతా గ్యారేజి వంటి చిత్రాలు భారీ విజయాలన్నీ అందించారు. ఫీరి కలయికలో వస్తున్నా ఈ దేవర మరొక సూపర్ హిట్ చిత్రంగా ఉండాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు, ఇది యాక్షన్-ప్యాక్ డ్రామాగా రూపొందించిన సినిమా.

ప్రశాంత్ నీల్ – భవిష్యత్తు దర్శకుడు
కెజిఫ్, సలార్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది దేవర విజయానికి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మంచి యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులకి అందిస్తారు అని పేరు పొందిన నీల్, ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమా రూపొందిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

ఈ నలుగురు దర్శక దిగ్గజాలతో కలిసి, దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రేక్షకుల మదిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధంగా ఉంది.

 

The post దేవర ప్రీ-రిచ్లీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నలుగురు ఐకానిక్ దర్శకులు స్టేజీ పంచుకోబోతున్నారు. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-pre-release-event-four-legendary-directors-to-join-jr-ntr-on-stage/feed/ 0