The post ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..?
నిన్న అంతా మంచు మనోజ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన దృశ్యాలు వైరల్ అవగా తాజాగా మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్ట్ లో వెల్లడిఅయింది.. మంచు మనోజ్ కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్ తనపై దాడి చేసాడని మోహన్ బాబు కూడా కేసు పెట్టారు.తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వైరల్ అవుతుంది.. మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ముదురుతుంది. ఈ తెల్లవారుజామున జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ రావడం జరిగింది..
మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను ఆయన తీసుకెళ్లాడు. రెండు రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు అలాగే ప్రైవేట్ బౌన్సర్లు కాపలా కాస్తున్నారు. కొద్ది రోజులుగా దుబాయ్ లో ఉంటున్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని సమాచారం. గతంలో ఓ సారి మంచు మనోజ్ బంధువుల ఇంటికి వెళ్లి మంచు విష్ణు వెళ్లి దాడి చేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే..దీనితో ఈ గొడవ ఎంతదూరం వెళ్తుందో చూడాలి..
The post ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.
]]>