Kota srinivasarao Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kota-srinivasarao/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 13 Jul 2025 13:41:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kota srinivasarao Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/kota-srinivasarao/ 32 32 కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/taraks-tribute-to-kota-special-post-goes-viral/ https://filmybowl.com/telugu/taraks-tribute-to-kota-special-post-goes-viral/#respond Sun, 13 Jul 2025 13:39:42 +0000 https://filmybowl.com/telugu/?p=4243 టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.దాదాపు 750 సినిమాలలో నటించిన కోటా విలక్షణమైన పాత్రలతో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, బాలయ్య, రాజశేఖర్, మోహన్ బాబు వంటి తదితరులు కోటా కు నివాళులు అర్పించారు.. నేను వచ్చేలోపే...

The post కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.దాదాపు 750 సినిమాలలో నటించిన కోటా విలక్షణమైన పాత్రలతో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, బాలయ్య, రాజశేఖర్, మోహన్ బాబు వంటి తదితరులు కోటా కు నివాళులు అర్పించారు..

నేను వచ్చేలోపే కోటన్న వెళ్ళిపోయాడు..వెక్కి వెక్కి ఏడ్చిన బాబూమోహన్..!!

ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం కోట శ్రీనివాసరావు మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.కోట శ్రీనివాసరావు నటనా ప్రతిభను కొనియాడుతూ, ఆయనతో తన అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఎన్టీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కోట శ్రీనివాసరావు గారు తెలుగు చిత్రసీమకు అందించిన సేవలను, ఆయన పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలను ఎన్టీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.సీనియర్ నటుల నుంచి నేటి జూనియర్ నటులతో కలిసి నటించిన ఘనత ఒక్క కోటా శ్రీనివాసరావుకే దక్కుతుంది.. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటించగల ప్రతిభ గల నటుడుగా కోటా గుర్తింపు పొందారు.

The post కోటా కు తారక్ ఘన నివాళి.. స్పెషల్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/taraks-tribute-to-kota-special-post-goes-viral/feed/ 0
నేను వచ్చేలోపే కోటన్న వెళ్ళిపోయాడు..వెక్కి వెక్కి ఏడ్చిన బాబూమోహన్..!! https://filmybowl.com/telugu/kotanna-left-before-i-arrived-babu-mohan-cried-so-hard/ https://filmybowl.com/telugu/kotanna-left-before-i-arrived-babu-mohan-cried-so-hard/#respond Sun, 13 Jul 2025 10:07:16 +0000 https://filmybowl.com/telugu/?p=4239 టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ మరణ వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. నేడు తెల్లవారుజామున 4 గంటలకు కోటా తుది శ్వాస విడిచారు..ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కోట శ్రీనివాసరావు దాదాపు 750 చిత్రాలకు పైగా నటించారు.. ఆయన విలక్షణమైన నటనకు గాను ఎన్నో ప్రతిస్టాత్మక అవార్డులు లభించాయి.. కోటా శ్రీనివాసరావు తనతో ఎంతో అనుబంధం ఉన్న...

The post నేను వచ్చేలోపే కోటన్న వెళ్ళిపోయాడు..వెక్కి వెక్కి ఏడ్చిన బాబూమోహన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ మరణ వార్త తెలిసి టాలీవుడ్ శోక సంద్రంలో మునిగి పోయింది.. నేడు తెల్లవారుజామున 4 గంటలకు కోటా తుది శ్వాస విడిచారు..ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కోట శ్రీనివాసరావు దాదాపు 750 చిత్రాలకు పైగా నటించారు.. ఆయన విలక్షణమైన నటనకు గాను ఎన్నో ప్రతిస్టాత్మక అవార్డులు లభించాయి.. కోటా శ్రీనివాసరావు తనతో ఎంతో అనుబంధం ఉన్న బాబు మోహన్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.. టాలీవుడ్  లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయింది.. కోటా, బాబు మోహన్ లు బయట కూడా అన్నదమ్ములు గా వుంటారు.. ఎంతో ఆత్మీయంగా కలుసుకునేవారు.. కోటా మరణ వార్త విని బాబూమోహన్ ఆయన ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు.

కోటా మరణం.. షాక్ లో టాలీవుడ్.. బాలయ్య, చిరంజీవి ఘన నివాళి..!!

ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ అందరికంటే నాకు ఎంతో ఆత్మీయుడు. నాకు సొంత అన్న లాంటి వాడు. ఆయనకు తమ్ముడు ఉన్నా నన్నే సొంత తమ్ముడిగా చూసుకున్నారు. మొన్న సాయంత్రం కూడా నేను ఓ షూటింగ్ విషయంలో ఫోన్ చేశాను. ఎప్పుడు వస్తావ్ రా అని అడిగాడు. రేపు వస్తానని చెప్పాను.నేను వచ్చేసరికి నా కోటన్న లేడు. వెళ్లిపోయాడు అంటూ బాబు మోహన్ కన్నీటి పర్యంతం అయ్యారు…

కోటన్న, నేను ఎప్పుడు కలుసుకున్న ఎంతో సరదాగా మాట్లాడుకుంటాం. ఒకే ప్లేట్ లో తినేవాళ్లం. ఆయన ఎన్నో సార్లు నాకు అన్నం కూడా తినిపించారు. సినిమాల్లో నాకు నా కోటన్న ఎంతో సపోర్ట్ గా నిలిచాడు… ఆయన ఈరోజు మనల్నందరిని వదిలి వెళ్లడం చాలా బాధాకరం.. కోటన్న లాంటి వ్యక్తీ మళ్ళీ దొరకడు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ బాబు మోహన్ సంతాపం తెలిపారు…

The post నేను వచ్చేలోపే కోటన్న వెళ్ళిపోయాడు..వెక్కి వెక్కి ఏడ్చిన బాబూమోహన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kotanna-left-before-i-arrived-babu-mohan-cried-so-hard/feed/ 0
కోటా మరణం.. షాక్ లో టాలీవుడ్.. బాలయ్య, చిరంజీవి ఘన నివాళి..!! https://filmybowl.com/telugu/kotas-death-tollywood-in-shock-balayya-chiranjeevi-pay-tribute/ https://filmybowl.com/telugu/kotas-death-tollywood-in-shock-balayya-chiranjeevi-pay-tribute/#respond Sun, 13 Jul 2025 06:38:09 +0000 https://filmybowl.com/telugu/?p=4235 టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.కోటా శ్రీనివాసరావు దాదాపు 750  పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.. ఆయన విలక్షణ నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి..టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు సినిమాతో కోటా శ్రీనివాసరావు ఇండస్ట్రీ కి...

The post కోటా మరణం.. షాక్ లో టాలీవుడ్.. బాలయ్య, చిరంజీవి ఘన నివాళి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.కోటా శ్రీనివాసరావు దాదాపు 750  పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.. ఆయన విలక్షణ నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి..టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు సినిమాతో కోటా శ్రీనివాసరావు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.. ఆ సినిమాలో చిన్న పాత్రలో ఆయన అద్భుతం గా నటించి మెప్పించారు.. ఆ తరువాత అద్భుతమైన నటనతో ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి మెప్పించారు..కోటా శ్రీనివాసరావు మరణవార్త విని నటుడు చిరంజీవి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు..

మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..?

‘లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట. కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది.శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను’ అని మెగాస్టార్ అన్నారు.

కోటా మరణవార్తపై నందమూరి బాలకృష్ణ స్పందించారు.. ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని బాలయ్య తెలిపారు..

The post కోటా మరణం.. షాక్ లో టాలీవుడ్.. బాలయ్య, చిరంజీవి ఘన నివాళి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kotas-death-tollywood-in-shock-balayya-chiranjeevi-pay-tribute/feed/ 0