filmybowl movie reviews Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/filmybowl-movie-reviews/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 26 Sep 2024 10:27:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg filmybowl movie reviews Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/filmybowl-movie-reviews/ 32 32 ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌ https://filmybowl.com/telugu/ntr-devara-release-trailer-review/ https://filmybowl.com/telugu/ntr-devara-release-trailer-review/#respond Thu, 26 Sep 2024 10:27:46 +0000 https://filmybowl.com/telugu/?p=408 NTR Devara Release Trailer Review ఎన్నో రోజులుగా అభిమానుల్ని , సినీ ప్రియుల్ని ఊరిస్తున్న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన NTR Devara Trailer ’ దేవర – భయం తో ధైర్యం కథ చెప్పిన కొరటాల ట్రైల‌ర్ రిలీజ్ అయింది 2 నిమిషాల 40 సెక‌న్ల ట్రైల‌ర్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అనుకొన్న‌ట్టే ఈ ట్రైల‌ర్‌ లో యాక్ష‌న్ కే పెద్ద పీట వేసాడు...

The post ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>

NTR Devara Release Trailer Review

ఎన్నో రోజులుగా అభిమానుల్ని , సినీ ప్రియుల్ని ఊరిస్తున్న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన NTR Devara Trailer ’ దేవర – భయం తో ధైర్యం కథ చెప్పిన కొరటాల ట్రైల‌ర్ రిలీజ్ అయింది 2 నిమిషాల 40 సెక‌న్ల ట్రైల‌ర్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అనుకొన్న‌ట్టే ఈ ట్రైల‌ర్‌ లో యాక్ష‌న్ కే పెద్ద పీట వేసాడు దర్శకుడు కొర‌టాల.

ఈ ట్రైలర్ లో యాక్షన్ కి పోటీగా డైలాగ్ లు కూడా మొత్తంగా నింపేసాడు దర్శకుడు. ఈ డైలాగ్ లు అన్ని భయం, ధైర్యం, సముద్రం , సంద్రం వీటి చుట్టూ తిరుగుతూ రాసినవే. బహుశా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అంత సముద్రమే కాబట్టి దర్శకుడు ఈ విధంగా రాసాడు అనుకోవాలి. సరే ఆ డైలాగ్స్ ఏంటో చూసేద్దాం పదండి

”దేవ‌ర‌ను చంపాలంటే స‌రైన స‌మ‌య‌మే కాదు, స‌రైన ఆయుధం కూడా దొర‌కాల‌”
“మ‌నిషికి బ‌తికేంత ధైర్యం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడ‌దు అని మీరు ఆ ధైర్యాన్ని కూడ‌గ‌డితే, ఆ ధైర్య‌న్ని చంపే భ‌య‌మ‌వుతా”
“కులం లేదు మ‌తం లేదు ధైర్యం త‌ప్ప ఏమీ లేదు”
”ప‌ని మీద పోయినోడైతే ప‌ని అవ్వంగానే తిరిగొస్తాడు. పంతం మీద పోయాడు నీ కొడుకు”
“భ‌యం మ‌ర‌చి ఎప్పుడైనా త‌ప్పుడు ప‌ని కోసం సంద్రం ఎక్కితే… ఈ రోజు నుంచి మీకు కాన‌రాని భయం అవుతావుండా”

Read Also : మనసిలాయో పాట అదరహో…

ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించాడు. దేవ‌ (పెద్ద ఎన్టీఆర్) ధైర్య‌వంతుడు. వ‌ర‌ (కొడుకు) భ‌య‌స్థుడు. ఈ రెండు పాత్ర‌ల పరిచయం చేసి ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చేసాడు ద‌ర్శ‌కుడు. టెక్నిక‌ల్ గా ఈ సినిమా చాలా ఉన్నత స్థాయి లో తీర్చిదిద్దారు .
సైఫ్ అలీ ఖాన్, ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌కాంత్ పాత్ర‌లు, ముసలి గెట్ అప్స్ లోనే కనిపించారు. జాన్వీ క‌పూర్ కి తొలి సినిమా నే మంచి పాత్ర లభించినట్టు ట్రైలర్ లో తెలుస్తుంది. కొరటాల ముందుగానే చెప్పినట్టు దేవ‌ర‌ చిత్రం కోసం ఓ ప్ర‌పంచాన్నే సృష్టించారు. నిరుద్ ఎప్పటిలానే తన మీద పెట్టుకున్న అంచనాలని మరోసారి దాటేశాడు. మొత్తంగా ట్రైలర్ అభిమానులకి తెగ నచ్చేస్తుంది. చూద్దాం ట్రైలర్ లో వున్నట్టే సినిమా కూడా ఉంటే ఎన్టీఆర్ మళ్ళి రికార్డుల వేట మొదలెట్టినట్టే

Follow us on Instagram

The post ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-release-trailer-review/feed/ 0
మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం https://filmybowl.com/telugu/mathu-vadalara-2-movie-full-review/ https://filmybowl.com/telugu/mathu-vadalara-2-movie-full-review/#respond Thu, 26 Sep 2024 07:19:52 +0000 https://filmybowl.com/telugu/?p=391 Mathu Vadalara 2 Movie Full Review తారాగణం: శ్రీ సింహ , సత్య, ఫారియా అబ్దుల్లా , సునీల్, వెన్నెల కిషోర్, అజయ్,రాజా, రోహిణి, ఝాన్సీ, సుదర్శన్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రొడక్షన్: క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ , మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్: చెర్రీ , హేమలత రైటర్ & డైరేక్షన్: రితేష్ రానా మ్యూజిక్: కాల భైరవ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 13, 2024 మత్తువదలరా...

The post మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Mathu Vadalara 2 Movie Full Review
Mathu Vadalara 2 Movie Full Review

Mathu Vadalara 2 Movie Full Review

తారాగణం: శ్రీ సింహ , సత్య, ఫారియా అబ్దుల్లా , సునీల్, వెన్నెల కిషోర్, అజయ్,రాజా, రోహిణి, ఝాన్సీ, సుదర్శన్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు
ప్రొడక్షన్: క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ , మైత్రి మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్స్: చెర్రీ , హేమలత
రైటర్ & డైరేక్షన్: రితేష్ రానా
మ్యూజిక్: కాల భైరవ
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 13, 2024

మత్తువదలరా సినిమాతో హీరో గా ఎంట్రీ తో నే మంచి విజయాన్ని అందుకున్న శ్రీసింహా కి ఆ తర్వాత నాలుగు సినిమాలు చేసిన హిట్ పలకరించలేదు.దాంతో తనకి మొదటి హిట్ ఇచ్చిన సినిమా కి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ , ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కి ప్రభాస్ , రాజమౌళి ని దింపడం తో సినీ ప్రేమికుల ద్రుష్టి ఈ సినిమా మీద పడింది.

మంచి అంచానాలతో ఈరోజు రిలీజ్ ఐన సినిమా ఎలా వుంది , సింహ కి సక్సెస్ దాహం తీర్చిందో లేదో చూద్దాం పదండి.

కథ
మత్తువదలరా సినిమా ఎక్కడైతే శుభం కార్డు పడిందో అక్కడ నుంచే మత్తువదలరా2 కథ మొదలవుతుంది. డెలివరీ ఏజెంట్స్ ఐన బాబూమోహన్ (సింహా) , యేసు (సత్య) లకి చేస్తున్న ఉద్యోగం పోవడం తో వేరొక జాబ్ ట్రైల్స్ లో వుంటారు. అదే సమయం లో హి టీం (హై ఎమర్జన్సీ టీం) లో ఉద్యోగాలు వున్నాయి అని పేపర్ లో చూసి తెలుసుకొని లంచం ఇచ్చి మరి ఆ ఉద్యోగాల్లో చేరిపోతారు. అక్కడ వీళ్ళ డ్యూటీ కిడ్నప్ కేసుల్ని డీల్ చేయడం.

ఒకే టీం లో పని చేస్తూ వచ్చే జీతం డబ్బులు సరిపోక కిడ్నప్ కేసుల్లో దొరికే సొమ్ము నుంచి కొంత “తస్కరించి” జీవితం గడిపేస్తుంటారు. కిడ్నాపర్లని పట్టుకొనే సమయం లో డబ్బు పోయిందని వీళ్ళ హెడ్ దీప (రోహిణి) కి కధలు చెప్పి తప్పించుకుంటుంటారు. ఎవరో తన కూతుర్ని కిడ్నప్ చేసి రెండు కోట్ల రూపాయిలు అడుగుతున్నారని బాబు, యేసులని సంప్రదిస్తుంది దామిని . ఇదే అదునుగా హి టీం తో సంబంధం లేకుండా ఈ కేసు ని తామే డీల్ చేసి ఆ రెండు కోట్లు నొక్కెయ్యాలని ప్లాన్ వేస్తారు. ఆ క్రమంలో అనుకోకుండా ఒక మర్డర్ కేసు లో ఇరుక్కుంటారు బాబు, యేసు.

ఆ మర్డర్ కేసు ఏంటి. ఆ మర్డర్ చేసింది ఎవరు. ఈ కేసు నుంచి బాబు,యేసు తప్పించుకోడానికి సీనియర్ అధికారి ఐన నిధి (ఫారియా) ఎలా సహాయ పడింది. ఈ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేసారు అనేది మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే:
ఈ మధ్య సీక్వెల్స్ సర్వ సాధారణం అయిపోయింది అలా అని సీక్వెల్ కి వుండే అర్ధానికి తగ్గట్టు తీస్తున్నారా అంటే అది లేదు

బాహుబలి సీక్వెల్ వచ్చిందంటే కథ కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడొస్తున్న సీక్వెల్స్ అన్ని పార్ట్ 1 ని కొంచెం అటు ఇటు కలిపి తీస్తున్నారు. అలాగే ఈ సినిమా ని పార్ట్ 1 కి కంటిన్యూ అనడం కంటే పార్ట్ 1 నే మళ్లీ చిన్న చేంజెస్ తో తీశారు అనుకోవచ్చు. పార్ట్ 1 కధనం లో వున్నా వేగం గాని, కథ గాని ఈ సీక్వెల్ లో లేవు, అలా అని సినిమా బాలేదా అంటే చాలా చోట్ల బావుంది. సత్య ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇవేమి గుర్తుకు రాకుండా చేస్తాయి .

పార్ట్ 1 చూసి థియేటర్ కి వచ్చిన వాళ్ళకి ఈ సినిమా స్టార్టింగ్ నుంచే ఆ పాత్రలతో కనెక్షన్ వచేసిద్ధి. సినిమా మొదటి హాఫ్ మొత్తం పాత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటది. అలంటి మొదటి సగం పూర్తి అయ్యేసరికి దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ మాత్రం విపరీతంగా ఆకట్టుకునిద్ది. రెండో హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రీయట్ చేసిద్ధి

ఇక రెండో హాఫ్ మొత్తం పార్ట్ 1 లో లాగానే మర్డర్ మిస్టరీ మీదే నడిపించాడు
మర్డర్ మిస్టరీ రివీల్ మొత్తం అంతగా ఆకట్టుకోదు కానీ మధ్య మధ్య లో సత్య ఇచ్చే ఎంటర్టైన్మెంట్ తో ఇవన్నీ కవర్ అయిపోతాయి. మధ్యలో ఒక హీరో పాత్ర , ఒక సీరియల్ డ్రామా కూడా సో సో గా నడుస్తాయి.

ప్రీ-క్లైమాక్స్ నుంచి మళ్లీ దర్శకుడి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అక్కడ వచ్చే చిన్న ట్విస్టులు , సినిమా ప్రధాన తారాగణం కలిసి చేసే ఒక ఫైట్ బాగా ఆకట్టుకునిద్ది , సత్య వేసే ఒక డాన్స్ ప్రేక్షకులకి సినిమా మీద మంచి ఒపీనియన్ తో బయటకి వచ్చేలాగా చేస్తుంది

పార్ట్ త్రీ కి కూడా అవకాశం ఉందనే హింట్ ఇస్తూ పార్ట్ 2 ని ముగించాడు దర్శకుడు.

Read Also : సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా
సింహా, సత్య మధ్య కామెడీ కెమిస్ట్రీ ఫుల్ గా వర్కౌట్ ఐంది. ఒక మాటలో చెప్పాలంటే సత్య ఈ సినిమా కి పెద్ద అసెట్. దర్శకుడి లోపం ఉన్న సీన్స్ కూడా స్క్రీన్ మీద పండాయి అంటే దానికి కారణం సత్య కామెడీ టైమింగ్. మంచి పాత్రలు పడితే సత్య ని ఆపలేం అనడానికి ఈ సినిమా నిదర్శనం.

ఈ సినిమా కి సరికొత్త ఆకర్షణ ఫారియా అబ్దుల్లా . ఆక్షన్ + సస్పెన్సు ఉన్న క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. ఇంకా మిగిలిన ఆర్టిస్ట్స్ అందరూ ఇచ్చిన పరిధిలో ఆకట్టుకున్నారనే చెప్పాలి

కాల భైరవ కథ కి సరిపడా BGM తో సీన్స్ ని చాల వరకు ఎలేవేటే చేసాడు. సినిమా కి అనుకున్న బడ్జెట్ లో రిచ్ గా కనిపించింది, ఎడిటింగ్ & సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరాయి

ఇక డైరెక్టర్ రితేష్ రానా లో చాలా మంచి హ్యూమర్, సెటైరికల్ కళ చాలా చోట్ల కనపడింది
నచ్చిన వాళ్ళకి ఇంకా నచ్చేసిద్ధి
యేసు పాత్ర మీతోనే వస్తు మిమ్మల్ని బాగా నవ్విస్తుంది

చివరగా

మత్తువదలరా3 – సత్య కోసం ఎదురుచూస్తుంటారు
Filmy Bowl Rating: 3/5

Follow us on Instagram

The post మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mathu-vadalara-2-movie-full-review/feed/ 0
35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం https://filmybowl.com/telugu/35-chinna-katha-movie-full-review/ https://filmybowl.com/telugu/35-chinna-katha-movie-full-review/#respond Thu, 26 Sep 2024 06:31:15 +0000 https://filmybowl.com/telugu/?p=380   35 chinna katha Movie Review తారాగణం: నివేథా థామస్, విశ్వదేవ్ , ప్రియదర్శి, మాస్టర్ అరుణ్, భాగ్యరాజ్, రేవతి, కృష్ణతేజ తదితరులు ప్రొడక్షన్: సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ , వాల్టాయిర్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్: సృజన్ యరబోలు, సిద్దార్థ్ రాళ్ళపల్లి రైటర్ & డైరేక్షన్: నందకిశోర్ యేమాని మ్యూజిక్: వివేక్ సాగర్ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 6, 2024 చిన్న సినిమా , పెద్ద సినిమా...

The post 35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
35 chinna katha Movie Full Review
35 chinna katha Movie Full Review

 

35 chinna katha Movie Review

తారాగణం: నివేథా థామస్, విశ్వదేవ్ , ప్రియదర్శి, మాస్టర్ అరుణ్, భాగ్యరాజ్, రేవతి, కృష్ణతేజ తదితరులు
ప్రొడక్షన్: సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ , వాల్టాయిర్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్: సృజన్ యరబోలు, సిద్దార్థ్ రాళ్ళపల్లి
రైటర్ & డైరేక్షన్: నందకిశోర్ యేమాని
మ్యూజిక్: వివేక్ సాగర్
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 6, 2024

చిన్న సినిమా , పెద్ద సినిమా అంటూ ఏమి లేదు
రిలీజ్ కి ముందు ఏదైనా చిన్న సినిమానే…. ప్రేక్షకుడు ఆదరించిన సినిమానే పెద్ద సినిమా అన్నట్టుంది ఈరోజు ఇండస్ట్రీ

బడా హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలని రెండేళ్ల కి ఒక సరి రిలీజ్ కి వస్తుంటే ఈ లోపు చిన్న సినిమా వాటి హవా ని చూపించేసి వెళ్తున్నాయి. కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ ఎంత పెద్ద విజయాలు సాధించాయి అందరికి తెలిసిందే అలాగే ఇప్పుడు ఈ 35 chinna katha Kadu కూడా అంతటి విజయాన్ని సాధించింది అనటం లో సందేహం లేదు
దగ్గుబాటి రానా లాంటి పెద్ద స్టార్ చేయి పడితే ఆ సినిమా ప్రమోషన్స్ కి కొదవేముంటది. అందుకే రిలీజ్ కి ముందే ఈ సినిమా మంచి బజ్ ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఒక లుక్కేద్దాం పదండి

కథ :
ప్రసాద్ (విశ్వదేవ్) , సరస్వతి (నివేధా) తిరుపతి లో నివాసముండే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం
వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అరుణ్ (పెద్దొడు) , వరుణ్ (చిన్నోడు). అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో లాగే సరస్వతి కి భర్త, పిల్లలే ప్రపంచం. పిల్లలని బాగా చదివించి వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలనీ కష్టపడుతుంటారు.

చిన్నోడు వరుణ్ బాగా చదువుతాడు , ఆలా అని అరుణ్ చదువురానోడు ఎం కాదు. లెక్కలు తప్ప అన్నిట్లో మంచి మార్క్స్ వస్తాయి. లెక్కల్లో ఎందుకు వీక్ అనేది కూడా దర్శకుడు చక్కగా చూపించాడు. అరుణ్ అడిగిన సందేహాల్ని ఉపాధ్యాయులు తీర్చకపోడం తో అరుణ్ కి గణితం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. అలా చదవకపోడం తో గణితం లో సున్నాలు వస్తుంటాయి.
అదే సమయం లో ఆ స్కూల్ కి వచ్చిన కొత్త లెక్కల మాస్టర్ చాణక్య (ప్రియదర్శి) వల్ల అరుణ్ కి ఇబ్బందులు మొదలవుతాయి. ఆ ఇబ్బందులు వల్ల కుటుంబం వరకు వెళ్లి అరుణ్ ఇల్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి కి వస్తాడు .

ఇల్లు వదిలి వెళ్లిన అరుణ్ తిరిగి వచ్చాడా లేదా?.
తనకి గణితం మీద ఉన్న ఆలోచనని ఎవరు మార్చారు?
ఈ సారి ఐన పాస్ అయ్యాడా లేదా అనేది మిగతా కథ…. అది సినిమా చూసి తెలుసుకుందాం

సినిమా ఎలా ఉంది:
సినిమా అంటే పాటలు , ఫైట్లు , మాస్, రొమాన్స్ , కాస్త అడల్ట్ కంటెంట్ ఇవే నేటి సినిమాలు
వాటికి బిన్నంగా తయారైన సినిమా ఇది.
మధ్యతరగతి బంధాలు ఎన్ని సార్లు చుసిన చూడాలనిపిస్తాయి , వాళ్ళ మాటలు, కథలు ఎప్పటికి బోర్ కొట్టవ్ వాటితో పాటు ఈ సినిమా లో తల్లితండ్రులు , నేటి సమాజం చూసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
ప్రస్తుత విద్యావ్యవస్థ , దానిలో లోటుపాట్లు , ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని ఈ చిత్రం క్లియర్ గా చెప్తుంది.
ఈ చిత్రం లో అంతర్లీనంగా మంచి మెసేజ్ ఉంది కానీ దర్శకుడు ఎక్కడ కూడా క్లాస్ పీకుతున్నట్టు ఉండదు ఎందుకంటే కధనంలో వినోదానికి ఢోకా లేకుండా చూసుకోడం వల్లనే
ఈ సినిమా లోని ముఖ్య పాత్రలని మనం చాలా తొందరగా రిలేట్ చేసుకుంటాం, అర్ధవంతమైన సంభాషణలు , అందరూ మనసు పెట్టి పనిచేయడం ఈ సినిమాకి ఉన్న ప్రధాన బలం
పిల్లల చిన్నతనంలోనే ఏదైనా అంశం మీద వ్యతిరేకం లేదా అనుమానం బలపడితే దాన్ని మార్చలేం. మార్చడం కూడా అంత తేలిక కాదు అని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం & దర్శకుడు ఆ విషయం లో 100 /100 శాతం విజయం సాధించాడు.

Read Also : కల్కి 2898 ఏడీ  మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

నటీనటుల పనితీరు

మంచి కథకి, మంచి పాత్ర కి మంచి నటీనటులు దొరికితే సినిమా ఎలా ఉంటాడో ఈ సినిమా ఒక నిదర్శనం
సరస్వతి పాత్రలో నివేదా ఎంత చక్కగా ఒదిగిపోయింది అని చెప్పడానికి మాటలు సరిపోవు
తన సొంత డబ్బింగ్ తో చిత్తూర్ యాస లో డైలాగ్స్ చెప్తూ, హావభావాలు పలకరిస్తుంటే, కొన్ని చోట్ల తెలీకుండానే కళ్ళు చెమర్చుతాయి. ఇంత మంచి నటిని తెలుగు దర్శకులు సరైన పాత్రలు ఇవ్వడంలేదేమో అని అనిపించకమానదు.

సరస్వతి భర్త గా తనకిచ్చిన పాత్రలో బాగా నటించాడు. ఇక చిన్న పిల్లాడి పాత్ర అరుణ్ గమ్మత్తుగా , అమాయకంగా బాగా చేసాడు. తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన మంచి నటుడు ప్రియదర్శి అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈగోయ్స్టిక్ టీచర్ గా నెగటివ్ షేడ్స్ లో చక్కగా నటించాడు. మిగిలిన పాత్రలన్నీ సరిగ్గా ఒదిగిపోయాయి.
సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం అందించాడు. సినిమా లో సందర్భానికి తగ్గట్టుగా వచ్చే ప్రతి పాత ఆణిముత్యమే. సినిమాటోగ్రఫీ కూడా కలర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమా ని నిర్మించడానికి ముందుకి వచ్చిన నిర్మాతలకి నిజంగా ధన్యవాదాలు.

దర్శకుడు నందకిషోర్ ఎంతో చక్కగా రాసుకున్న పాత్రలు, ఎమోషన్స్ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లగల దర్శకుడు

చివరగా
35 – ఇది నిజంగానే చిన్న కథ కాదు
Filmy Bowl Rating: 3.25/5

Follow us on Instagram

The post 35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/35-chinna-katha-movie-full-review/feed/ 0