eega Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/eega/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 17 Jul 2025 07:09:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg eega Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/eega/ 32 32 Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..? https://filmybowl.com/telugu/rajamouli-do-you-know-what-the-directors-favorite-movie-is/ https://filmybowl.com/telugu/rajamouli-do-you-know-what-the-directors-favorite-movie-is/#respond Thu, 17 Jul 2025 07:09:33 +0000 https://filmybowl.com/telugu/?p=4305 దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన తీసిన చిత్రాలలో ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ అందుకోలేదు.. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ప్రేక్షకులని ఆకట్టుకునే సన్నివేశాలు ఉండేట్లు జాగ్రత్త పడతాడు.. రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే.. తాను చేసే సినిమాలో ఏ హీరో అయిన గతంలో ఎన్నడూ చేయని విధంగా పాత్రని డిజైన్ చేస్తారు.. ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ అంశాలతో...

The post Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన తీసిన చిత్రాలలో ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ అందుకోలేదు.. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ప్రేక్షకులని ఆకట్టుకునే సన్నివేశాలు ఉండేట్లు జాగ్రత్త పడతాడు.. రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే.. తాను చేసే సినిమాలో ఏ హీరో అయిన గతంలో ఎన్నడూ చేయని విధంగా పాత్రని డిజైన్ చేస్తారు.. ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ అంశాలతో రాజమౌళి ప్రేక్షకులని మాయ చేస్తారు.. రాజమౌళి కెరీర్ లో బాహుబలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది.. అయితే ఇంత ప్రభంజనం సృష్టించిన బాహుబలి ఫ్రాంచైజ్ చిత్రాలు కూడా తన కెరీర్‌లో బెస్ట్ చిత్రాలు కాదంటూ రాజమౌళి ఊహించని బాంబ్ పేల్చాడు..

ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ సినిమా ‘జూనియర్’. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు స్పందించిన రాజమౌళి, తన కెరీర్‌లో ఆయనకు అత్యంత ఇష్టమైన సినిమా ‘ఈగ’ అని చెప్పారు.

RRR షూటింగ్ సమయంలో ‘స్టూడెంట్ నెం.1’ లొకేషన్స్‌కు వెళ్లినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక పాత ఫోటోను రీ క్రియేట్ చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నాడు. “సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీయాలని అందరూ భావించారు. కానీ ‘సై’తో ఆ అంచనాలన్నీ బ్రేక్ చేసి, యూత్‌ఫుల్ సినిమాని తీసాం. నచ్చిన కథకు తగ్గట్టుగా సినిమాలు తీయొచ్చని అప్పుడు అర్థమైంది అని ఆయన తెలిపారు.

The post Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajamouli-do-you-know-what-the-directors-favorite-movie-is/feed/ 0
సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..? https://filmybowl.com/telugu/when-will-rajamoulis-film-with-his-own-story-come/ https://filmybowl.com/telugu/when-will-rajamoulis-film-with-his-own-story-come/#respond Sat, 28 Dec 2024 10:58:16 +0000 https://filmybowl.com/telugu/?p=1730 దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే సొంతం..ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.. రాజమౌళి సినిమా వచ్చిన ప్రతి సారి ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి.రాజమౌళి చివరిగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది..ఈ సినిమాతో ఇండియన్...

The post సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే సొంతం..ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.. రాజమౌళి సినిమా వచ్చిన ప్రతి సారి ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతాయి.రాజమౌళి చివరిగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది..ఈ సినిమాతో ఇండియన్ సినీ హిస్టరీలో ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ సాధించి ప్రపంచ దిగ్గజ దర్శకుల జాబితాలో రాజమౌళి చేరారు..

తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు.. దీంతో రాజమౌళి సినిమా అంటే ఎంత బడ్జెట్ పెట్టడానికి అయినా సరే నిర్మాతలు పోటీ పడుతున్నారు..రాజమౌళి తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో రాజమౌళి చాలా బిజీబిజీగా ఉన్నారు. మహేష్ బాబుతో రాజమౌళి గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. మిగిలిన దర్శకుల కంటే అయితే క్రియేటివ్ గా సీన్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న ఎప్పుడు ముందు వుంటారు..కానీ రాజమౌళి సినిమా విషయంలో ఆ ఒక్కటే తక్కువవుతుంది..అదే సొంత కథతో సినిమా చేయకపోవడం.

రాజమౌళి సినిమా చేయాలంటే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించాల్సిందే. ఇప్పటి వరకూ రాజమౌళి సొంత కథతో ఒక్క సినిమా కూడా లేదు. తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ కి స్టోరీ అందించింది పృథ్వీరాజ్. ఆ తర్వాత తెరకెక్కించిన సింహాద్రి,సై,ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, బాహుబలి,ఆర్ఆర్ఆర్ వరకూ అన్ని సినిమాలకు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ లను అందించారు. మధ్యలో ఈగ సినిమాకి మాత్రం విజయేంద్ర ప్రసాద్ కేవలం కాన్సెప్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది..
ఆ కథని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం రాజమౌళి. అలాగే మర్యాద రామన్న కు ఎస్. ఎస్ కాంచి స్టోరీ ఇచ్చారు. ఆ కథను కూడా రాజమౌళి తనదైన శైలిలో మలిచారు .అలా ఆ రెండు సినిమాల పరంగా రాజమౌళి స్టోరీ రైటింగ్ లో పనీ చేసారు. సొంత కథతో సినిమా తీసే దర్శకుల జాబితాలో రాజమౌళి ఎప్పుడు చేరతారో చూడాలి..

The post సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/when-will-rajamoulis-film-with-his-own-story-come/feed/ 0