#balayya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/balayya/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 23 Jul 2025 15:23:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #balayya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/balayya/ 32 32 హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? https://filmybowl.com/telugu/harihara-veeramallu-balayya-in-a-surprising-role/ https://filmybowl.com/telugu/harihara-veeramallu-balayya-in-a-surprising-role/#respond Wed, 23 Jul 2025 15:23:35 +0000 https://filmybowl.com/telugu/?p=4414 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. ఐదేళ్ల నిరీక్షణ తరువాత ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధం అయింది..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ డ్రామాని ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా...

The post హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. ఐదేళ్ల నిరీక్షణ తరువాత ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధం అయింది..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ డ్రామాని ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించారు.. జులై 24 న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!!

ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు సమాచారం.. పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తూ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రెస్ మీట్‌లు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో పాల్గొంటు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేస్తున్నారు..తాజాగా ఈ చిత్రానికి సంబందించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో నట సింహం బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని ప్రముఖ య్యూటుబర్ నా అన్వేషణ అన్వేష్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అతను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన హరిహరవీరమల్లు సినిమాకి సంబంధించి మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా సూపర్ ఉందని, థియేటర్‌లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయని రివ్వ్యూ ఇచ్చాడు. హరిహర వీరమల్లులో బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ ఉందని తెలిపాడు..కానీ తర్వాత అదంతా ఫేక్ అని అన్వేష్ ట్విస్ట్ ఇచ్చాడు. సినిమా రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదని , తాను సినిమానే చూడలేదని వీడియోలో చెప్పుకొచ్చాడు.. మూవీలపై తప్పుడు రివ్యూలు ఇచ్చే వారికి ఓ గుణపాఠం చెప్పాలని తాను ఈ వీడియో చేసినట్టు అవినాష్ తెలిపారు..

The post హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/harihara-veeramallu-balayya-in-a-surprising-role/feed/ 0
కోటా మరణం.. షాక్ లో టాలీవుడ్.. బాలయ్య, చిరంజీవి ఘన నివాళి..!! https://filmybowl.com/telugu/kotas-death-tollywood-in-shock-balayya-chiranjeevi-pay-tribute/ https://filmybowl.com/telugu/kotas-death-tollywood-in-shock-balayya-chiranjeevi-pay-tribute/#respond Sun, 13 Jul 2025 06:38:09 +0000 https://filmybowl.com/telugu/?p=4235 టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.కోటా శ్రీనివాసరావు దాదాపు 750  పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.. ఆయన విలక్షణ నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి..టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు సినిమాతో కోటా శ్రీనివాసరావు ఇండస్ట్రీ కి...

The post కోటా మరణం.. షాక్ లో టాలీవుడ్.. బాలయ్య, చిరంజీవి ఘన నివాళి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.కోటా శ్రీనివాసరావు దాదాపు 750  పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.. ఆయన విలక్షణ నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి..టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు సినిమాతో కోటా శ్రీనివాసరావు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.. ఆ సినిమాలో చిన్న పాత్రలో ఆయన అద్భుతం గా నటించి మెప్పించారు.. ఆ తరువాత అద్భుతమైన నటనతో ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి మెప్పించారు..కోటా శ్రీనివాసరావు మరణవార్త విని నటుడు చిరంజీవి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు..

మరో భారీ ప్రాజెక్ట్ కి సిద్దమైన శంకర్.. నిర్మాత దొరుకుతాడా..?

‘లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట. కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది.శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను’ అని మెగాస్టార్ అన్నారు.

కోటా మరణవార్తపై నందమూరి బాలకృష్ణ స్పందించారు.. ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని బాలయ్య తెలిపారు..

The post కోటా మరణం.. షాక్ లో టాలీవుడ్.. బాలయ్య, చిరంజీవి ఘన నివాళి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kotas-death-tollywood-in-shock-balayya-chiranjeevi-pay-tribute/feed/ 0
అఖండ 2 : బాలయ్య మూవీలో బజరంగి భాయి జాన్ బ్యూటీ..!! https://filmybowl.com/telugu/akhanda-2-bajrangi-bhais-beauty-in-balayyas-movie/ https://filmybowl.com/telugu/akhanda-2-bajrangi-bhais-beauty-in-balayyas-movie/#respond Wed, 02 Jul 2025 16:40:40 +0000 https://filmybowl.com/telugu/?p=4073 నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అఖండ 2 కూడా భారీ హిట్ అవుతుందనీ ఫ్యాన్స్ ధీమాగా వున్నారు.ఇప్పుడు తెరకెక్కబోయే సినిమా అఖండను మించి ఉంటుదని...

The post అఖండ 2 : బాలయ్య మూవీలో బజరంగి భాయి జాన్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అఖండ 2 కూడా భారీ హిట్ అవుతుందనీ ఫ్యాన్స్ ధీమాగా వున్నారు.ఇప్పుడు తెరకెక్కబోయే సినిమా అఖండను మించి ఉంటుదని సమాచారం..

వార్ 2 : ఆ విషయంలో ఫ్యాన్స్ కి నిరాశే మిగలనుందా..?

ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు..అఖండ 2 లో మరో పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన హర్షాలీ మల్హోత్రా అఖండ 2తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె సాంప్రదాయ చీరలో అందమైన చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తుంది.

ఇటీవల బాలయ్య బర్త్డే సందర్బంగా రిలీజ్ అయిన టీజర్‌కు నేషనల్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు.. ఈ సినిమాలో టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు.తమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.. అఖండ 2 ను మేకర్స్ దసరా సందర్బంగా సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

The post అఖండ 2 : బాలయ్య మూవీలో బజరంగి భాయి జాన్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-bajrangi-bhais-beauty-in-balayyas-movie/feed/ 0
అఖండ 2 : శర వేగంగా షూటింగ్.. బాలయ్య పిక్ వైరల్..!! https://filmybowl.com/telugu/akhanda-2-shooting-is-going-on-at-a-fast-pace-balayyas-pic-goes-viral/ https://filmybowl.com/telugu/akhanda-2-shooting-is-going-on-at-a-fast-pace-balayyas-pic-goes-viral/#respond Sun, 20 Apr 2025 09:02:47 +0000 https://filmybowl.com/telugu/?p=3696 నందమూరి నట సింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ కూడా వచ్చాయి.ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 చేస్తున్నాడు.. గతంలో వచ్చిన అఖండ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా...

The post అఖండ 2 : శర వేగంగా షూటింగ్.. బాలయ్య పిక్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నట సింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ కూడా వచ్చాయి.ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 చేస్తున్నాడు.. గతంలో వచ్చిన అఖండ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…దీనితో ‘అఖండ 2’ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

జింఖానా : మరో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వస్తున్న ప్రేమలు హీరో..!!

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.. ఇప్పుడు తెరకెక్కే అఖండ 2 సైతం ఓ రేంజ్ లో ఉండనుందని సమాచారం..ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వుంది.

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య బాబు ‘అఖండ 2’ కు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలకృష్ణను పవర్ ఫుల్ పాత్రకోసం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది.మేకప్ డిజైనర్ బాలయ్యను అఖండ పాత్రలో సిద్ధం చేస్తున్నారు..నుదిటిన నామాలు దిద్ది.. బొట్టు పెట్టింది. అలాగే గడ్డంపై కూడా వైట్ కలర్‌పూసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఇదిలా ఉంటే బాలయ్య తన తరువాత సినిమాను తనకి వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపి చంద్ డైరెక్షన్ లో చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం..

The post అఖండ 2 : శర వేగంగా షూటింగ్.. బాలయ్య పిక్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-shooting-is-going-on-at-a-fast-pace-balayyas-pic-goes-viral/feed/ 0
బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!! https://filmybowl.com/telugu/the-star-director-is-planning-another-village-mass-movie-with-balayya/ https://filmybowl.com/telugu/the-star-director-is-planning-another-village-mass-movie-with-balayya/#respond Thu, 17 Apr 2025 12:59:49 +0000 https://filmybowl.com/telugu/?p=3658 నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం అదే జోష్ లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ...

The post బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం అదే జోష్ లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తారక్ నటనతో కుమ్మేసాడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే అఖండ 2 సినిమాతో పాటు బాలయ్య నెక్ట్స్ సినిమా కూడా ఫిక్స్ అయింది. తనకు గతంలో వీరసింహ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన గోపీచంద్ మలినేని ఇటీవల బాలయ్యకు ఓ కథ చెప్పాగా దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీనితో ఈ సినిమాకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి.. ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు. బాలయ్య బర్త్ డే కానుకగా జూన్ 10న పూజా కార్యక్రమంతో గ్రాండ్ లాంఛ్ చేయనున్నారు.

గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డిలోని బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు కూడా వచ్చాయి..దీంతో మరోసారి గోపిచంద్‌తో సినిమా చేసేందుకు బాలయ్య సిద్ధం అవుతున్నాడు. అయితే ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని సమాచారం.. బాలయ్య తో గోపీచంద్ మలినేని మరో ఊర మాస్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం… ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు.అఖండ 2 షూటింగ్ పూర్తి అయ్యాక ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కానుంది..

 

The post బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-star-director-is-planning-another-village-mass-movie-with-balayya/feed/ 0
బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. ఇక దబిడి దిబిడే..? https://filmybowl.com/telugu/balayya-as-bigg-boss-host-is-he-still-a-slob/ https://filmybowl.com/telugu/balayya-as-bigg-boss-host-is-he-still-a-slob/#respond Mon, 07 Apr 2025 09:52:01 +0000 https://filmybowl.com/telugu/?p=3499 తెలుగు లో బిగ్ బాస్ రియాలిటి షో కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సరికొత్త గా ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ప్రేక్షకులను టీవీ లకు అతుక్కు పోయేలా చేస్తుంది..ప్రపంచవ్యాప్తంగా ఈ రియాలిటీ షో కి మంచి క్రేజ్ ఉంది.. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలెట్టిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో వరుస సీజన్స్ తో దూసుకుపోతుంది.. ప్రారంభం ఎన్టీఆర్...

The post బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. ఇక దబిడి దిబిడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు లో బిగ్ బాస్ రియాలిటి షో కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సరికొత్త గా ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ప్రేక్షకులను టీవీ లకు అతుక్కు పోయేలా చేస్తుంది..ప్రపంచవ్యాప్తంగా ఈ రియాలిటీ షో కి మంచి క్రేజ్ ఉంది.. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలెట్టిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో వరుస సీజన్స్ తో దూసుకుపోతుంది.. ప్రారంభం ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా ఈ షో కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.. బిగ్ బాస్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించారు.. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన మొదటి సీజన్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. అద్భుతమైన టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోయింది..కానీ ఆ తరువాత సీజన్ కి ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో చేయడం కుదర్లేదు..

యుగానికి ఒక్కడు : సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. కానీ అదొక్కటే సమస్య..!!

రెండో సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసారు..ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా సామాన్యులకు సైతం అవకాశం ఇవ్వడంతో రెండో సీజన్ కి మరింత క్రేజ్ వచ్చింది.. నాని సైతం హోస్ట్ గా అదరగొట్టాడు.. అయితే మొదటి సీజన్ తో పోలిస్తే టీఆర్పి రేటింగ్ తగ్గడంతో మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహారించారు.. హోస్ట్ గా నాగార్జునకు బాగా అనుభవం ఉండటంతో ఈ షో కి ఆయనే పర్ఫెక్ట్ అని నిర్వాహకులు నమ్మారు..

మూడో సీజన్ మొదలుకొని వరుసగా ఎనిమిదివ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేసారు.. అయితే ఇటీవల చేసిన ఎనిమిడో సీజన్ కి అంతగా ఆదరణ లభించకపోవడం అక్కినేని నాగార్జున వరుస వివాదాలు ఎదుర్కోవడంతో బిగ్ బాస్ షో హోస్ట్ గా తప్పుకోనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. నాగార్జున తప్పుకుంటే ఈ షో కి బాలయ్య హోస్ట్ గా వస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు.. ఇప్పటికే బాలయ్య అన్ స్టాప్పబుల్ షో తో దూసుకుపోతున్నాడు.. హోస్ట్ గా బాలయ్య ఎంతగానో అలరిస్తున్నారు.. ఇదిలా ఉంటే ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు బాలయ్యని కలిసినట్లు సమాచారం. అయితే బాలయ్య ఒప్పుకోకుంటే రానా తో హోస్ట్ చేయించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట..

 

The post బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. ఇక దబిడి దిబిడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayya-as-bigg-boss-host-is-he-still-a-slob/feed/ 0
బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/ https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/#respond Thu, 03 Apr 2025 17:12:02 +0000 https://filmybowl.com/telugu/?p=3439 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ” ఆదిత్య 369 “.. ఈ మూవీ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు..ఈ చిత్రాన్ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.1991 ఆగస్టు 18న విడుదలైన...

The post బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ” ఆదిత్య 369 “.. ఈ మూవీ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు..ఈ చిత్రాన్ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.1991 ఆగస్టు 18న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా పలు అవార్డులను సైతం గెలుచుకుంది. భారతీయ సినిమాలో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రంగా తెరకెక్కిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీ కృష్ణదేవరాయలుగా అద్భుతంగా నటించి మెప్పించారు..కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అందించిన మ్యూజిక్ చిరస్థాయిగా నిలిచి పోతుంది..

SSMB 29: ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..?

అయితే ఈ సినిమా వచ్చిన 34 ఏండ్ల తర్వాత మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఈ సినిమాకు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.ఈ సినిమాను ఏప్రిల్ 04 న గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది.. అయితే ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో విశ్వంభర దర్శకుడు వశిష్ట స్పెషల్ పోస్ట్ చేసారు..

బింబిసార సినిమాను తెరకెక్కించడానికి నాకు స్ఫూర్తినిచ్చిన చిత్రం ఆదిత్య 369. నాకు ఇష్టమైన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ, లెజెండరీ సింగీతం శ్రీనివాస రావు గారి టైమ్ ట్రావెల్ మాస్టర్‌పీస్ ఆదిత్య 369 ఏప్రిల్ 4న మళ్లీ విడుదల కాబోతుంది.. మీ అభిమాన థియేటర్లలో చూడండి.. అస్సలు మిస్ అవ్వొద్దు.. 4K క్వాలిటీలో రీస్టోర్ చేసినందుకు నిర్మాత కృష్ణ శివలెంక గారికి ధన్యవాదాలు..అంటూ వశిష్ట పోస్ట్ వేసారు..

 

The post బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/interesting-post-by-megastar-director-on-balayya-movie/feed/ 0
ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/is-that-the-reason-why-balayya-said-no-to-that-star-director/ https://filmybowl.com/telugu/is-that-the-reason-why-balayya-said-no-to-that-star-director/#respond Thu, 03 Apr 2025 13:49:47 +0000 https://filmybowl.com/telugu/?p=3431 నందమూరి నటసింహం బాలయ్య కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.. బాలయ్య ఇటీవల వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు చూపిస్తున్నారు.. యంగ్ హీరోస్ కి సైతం సాధ్యం కానీ రికార్డ్స్ సాధిస్తూ బాలయ్య అదరగొడుతున్నారు.. టాలీవుడ్ సీనియర్ హీరోలలో అత్యధిక సక్సెస్ రేట్ బాలయ్య కే వుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు టాక్ షో హోస్ట్ గాను బాలయ్య అదరగొడుతున్నారు. అలాగే పాలిటిక్స్ లో సైతం...

The post ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.. బాలయ్య ఇటీవల వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు చూపిస్తున్నారు.. యంగ్ హీరోస్ కి సైతం సాధ్యం కానీ రికార్డ్స్ సాధిస్తూ బాలయ్య అదరగొడుతున్నారు.. టాలీవుడ్ సీనియర్ హీరోలలో అత్యధిక సక్సెస్ రేట్ బాలయ్య కే వుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు టాక్ షో హోస్ట్ గాను బాలయ్య అదరగొడుతున్నారు. అలాగే పాలిటిక్స్ లో సైతం బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నారు.ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య సూపర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాతో కలిపి బాలయ్య డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.

దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ప్రస్తుతం అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 షూటింగ్ లో బాలయ్య బిజీగా వున్నారు..అయితే బాలయ్య ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీని రిజెక్ట్ చేసారని సమాచారం.. ఆ పాన్ ఇండియా సినిమానే ‘జాట్’. సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఓ పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం బాలయ్యను అనుకున్నారు. గతంలో బాలయ్యకు వీర సింహారెడ్డి వంటి మాస్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడంతో బాలయ్య ను గెస్ట్ రోల్ లో నటింపచేసేందుకు గోపీచంద్ ఎంతో ప్రయత్నించారట.. కాని బాలయ్య మాత్రం ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారని సమాచారం…

ఇటీవల రిలీజ్ అయిన జాట్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో అకట్టుకుంది.అయితే బాలయ్య కనుక ఆ పాత్ర చేస్తే బాగుండేది అని బాలయ్య కు పాన్ ఇండియా రేంజ్ రీచ్ వస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ అది చిన్న పాత్ర కావడంతో బాలయ్య తిరస్కరించారని తెలుస్తుంది..అఖండ సీక్వెల్ భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో తెర కెక్కుతుంది.. ప్రస్తుతం బాలయ్య తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే ఉంచారు..

 

The post ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-that-the-reason-why-balayya-said-no-to-that-star-director/feed/ 0
ఆదిత్య 369 : కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్.. తగ్గేదిలేదంటున్న బాలయ్య..!! https://filmybowl.com/telugu/aditya-369-a-sequel-to-the-cult-classic-movie-balayya-says-there-is-nothing-to-be-done/ https://filmybowl.com/telugu/aditya-369-a-sequel-to-the-cult-classic-movie-balayya-says-there-is-nothing-to-be-done/#respond Mon, 31 Mar 2025 10:32:11 +0000 https://filmybowl.com/telugu/?p=3382 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీస్ లో “ఆదిత్య 369” కి ప్రత్యేక స్థానం వుంది.. అప్పటి వరకు ఏ హీరో చేయని ప్రయోగం బాలయ్య చేసారు.. దేశంలోనే మొట్ట మొదటి టైం ట్రావెల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది..తనకి భైరవ ద్వీపం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో బాలయ్య ఈ సినిమా చేసారు..ఎస్ పి బి బాలసుబ్రమణ్యం నిర్మాణంలో...

The post ఆదిత్య 369 : కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్.. తగ్గేదిలేదంటున్న బాలయ్య..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీస్ లో “ఆదిత్య 369” కి ప్రత్యేక స్థానం వుంది.. అప్పటి వరకు ఏ హీరో చేయని ప్రయోగం బాలయ్య చేసారు.. దేశంలోనే మొట్ట మొదటి టైం ట్రావెల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది..తనకి భైరవ ద్వీపం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో బాలయ్య ఈ సినిమా చేసారు..ఎస్ పి బి బాలసుబ్రమణ్యం నిర్మాణంలో తెరకెక్కిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. బాలయ్య ఈ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో అద్భుతంగా నటించాడు. అప్పట్లో భారీ సక్సెస్ సాధించిన ఈ సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 4వ తేదీన మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు.

చరణ్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!!

ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్ కు చేయని విధంగా ఫస్ట్ టైమ్ ఆదిత్య 369కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈవెంట్ లో  మూవీ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం తన అదృష్టం అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని అన్నారు..

నేను పాత్రల పరంగా వేరియేషన్స్ కోసం చూస్తున్న టైమ్ లో కృష్ణ ప్రసాద్ గారు, సింగీతం శ్రీనివాసరావు నా దగ్గరకు వచ్చి కథ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. పౌరాణిక పాత్రల్లో నాన్న గారి లాగా నటించాలని అనుకున్నాను. ఇందులో శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర కోసం ఒప్పుకున్నాను. ఆ పాత్ర నాకు బాగా గుర్తింపు తెచ్చింది. ఇందులో చాలా పాత్రల్లో కనిపించాను. దర్శకుడు అన్నీ అనుకున్నట్టు బాగా కుదిరాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావుకు, శివలెంక కృష్ణ ప్రసాద్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు… అలాగే ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా నా ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు.. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లుగా బాలయ్య తెలిపారు.. అది కూడా బాలయ్య స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది..

 

The post ఆదిత్య 369 : కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్.. తగ్గేదిలేదంటున్న బాలయ్య..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aditya-369-a-sequel-to-the-cult-classic-movie-balayya-says-there-is-nothing-to-be-done/feed/ 0
కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/ https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/#respond Tue, 18 Mar 2025 10:23:50 +0000 https://filmybowl.com/telugu/?p=3193 భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం...

The post కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది… 1991లో విడుదలైన ఆదిత్య 369 సినిమాను అప్పటి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు..గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ సినిమా విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కింది.

‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!!

దర్శకుడు సింగీతం ఈ సినిమాను ముందుగా కమల్ హాసన్ తో తీయాలని అనుకున్నారు కానీ అనుకోని కారణాలతో అది సాధ్యం కాలేదు. శ్రీ కృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణ అయితే బాగా సూటవుతారనే ఉద్దేశంతో బాలయ్యని ఈ సినిమాలో తీసుకున్నారు.కమల్ ఈ సినిమా చేయలేకపోవడంతో బాలయ్యే ఈ సినిమాలో కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా , బాలీవుడ్ విలన్ అమ్రిష్ పూరిని విలన్ గా నటించారు..1991 ఆగస్ట్ 18 విడుదలైన ఆదిత్య 369 చూసి ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలో కనిపించడం ఫ్యాన్స్ కి సైతం ఎంతో కొత్తగా అనిపించింది.

సినిమా అంతా ఒకెత్తు అయితే ఇళయరాజా సాంగ్స్ మరొక ఎత్తు అని చెప్పాలి.వినసొంపైన పాటలు, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్, రాయల కాలం ఎపిసోడ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అన్ని సినిమాని ఊహించని రేంజ్ కి తీసుకెళ్లాయి..ప్రస్తుత జనరేషన్ కోసం ఈ సినిమాను మళ్ళీ 4K లో రిలీజ్ చేస్తున్నారు..ఈ కల్ట్ క్లాసిక్ మూవీని మేకర్స్ 2025 ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది..ఈ అద్భుతమైన సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు..

 

The post కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/feed/ 0