టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.. మన టాలీవుడ్ స్టార్ స్టార్ హీరోలు గతంలో నటించిన ఐకానిక్ మూవీస్ నీ ఫ్యాన్స్ కోసం మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.. సినిమా రిలీజ్ రోజు ఎలాంటి సందడి కొనసాగిందో రీ రిలీజ్ లో సైతం ఫ్యాన్స్ ఆ రేంజ్ హంగామా సృష్టిస్తున్నారు..తమ హీరోల సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
రీ రిలీజ్ లో కూడా ట్రెండ్ సృష్టిస్తున్న సినిమాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. దాదాపు 12 ఏళ్ళ ఈ హిట్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు ఎంపిక చేసిన పలు థియేటర్లలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజయింది. విడుదలై 12 ఏళ్ళు దాటినా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. థియేటర్లో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఈ సినిమా చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ది రాజాసాబ్ : మూవీ ఔట్పుట్ పై ప్రభాస్ అసంతృప్తి..!!
ఏకంగా థియేటర్లలోనే సినిమాలోని సీన్లను రీక్రియెట్ చేస్తూ ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు. ఓ థియేటర్లో ఈ సినిమాలో పెళ్లిలో మహేష్ పూలకుండీ తన్నే సీన్ ని ఫ్యాన్స్ రీక్రియెట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్ని సినిమాలు వచ్చినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఇచ్చే వైబే వేరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరో థియేటర్లో వెంకటేష్- అంజలి పెళ్లి సీన్ రీక్రియెట్ చేశారు.2013లో విడుదలైన ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసింది. పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో వెంకటేష్, మహేష్ బాబు అద్భుతంగా నటించారు.. టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సినిమాలలో ఈ సినిమా కూడా నిలిచింది.. మళ్ళీ ఇప్పట్లో ఇలాంటి సినిమా రాదేమో.. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతున్నాయి..
Pulla Kundi Scenes Recreate chesaru ga Raa 😂😂🤣#SVSCReRelease #SVSC4K #MaheshBabu pic.twitter.com/KvbEGMBzU6
— SAI DHFM 🌶️ 🔥 (@MbGodavari) March 7, 2025