MOVIE NEWS

ఇంట్రెస్టింగ్ గా సూర్య ‘రెట్రో ‘ ట్రైలర్.. ఈ సారి హిట్ గ్యారెంటీ..?

తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య కు తెలుగు లో కూడా స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ వుంది..సూర్య నటన అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం.. అందుకే సూర్య ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది.. అలాగే సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ సైతం భారీగానే వస్తాయి.. అయితే సూర్య ఇటీవల “ కంగువా “ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఆ మూవీ సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.దీనితో తన తరువాత సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకోవాలని సూర్య చూస్తున్నాడు..

పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!!

సూర్య నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ ‘రెట్రో’.స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది.మే 1న సినిమాను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. సూర్యకు సాలిడ్ హిట్ పడి చాలా కాలం అవుతోంది. దీంతో తనకు కలిసి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన కనిమ సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో సూర్య లుక్ పూర్తి భిన్నంగా ఉంది.

గొడవల్లో పుట్టి పెరిగిన గ్యాంగ్ స్టర్ గా సూర్య పాత్ర ఉండనున్నట్లు తెలుస్తుంది.. అత్యంత సీరియస్ గా ఉండే సూర్యకు పూజాహెగ్డేతో లవ్ ఏవిధంగా నడుస్తుంది అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.ట్రైలర్ లో ‘ఇన్నేళ్ల మా బంధం నన్ను బుద్ధుడిగా చేసింది.. రాక్షసుడిగా మార్చింది’ అనే సూర్య చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది..ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ నాజర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్,బీజీఎం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది..ఈ సినిమాతోనైనా సూర్య హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Related posts

డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

murali

ఓటీటిలో దూసుకుపోతున్న నాగచైతన్య “తండేల్”..!!

murali

మున్నా భాయ్ 3 వచ్చే టైమ్ ఆసన్నమైంది – రాజ్ కుమార్ హిరాని

filmybowl

Leave a Comment