MOVIE NEWS

సూర్య 44 : క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!!

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కంగువా “.. హీరో సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది..స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్గ్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. సినిమాలో సూర్య నటన బాగున్నా కానీ.. కథలో కొత్తదనం లేకపోవడం పూర్ స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది..

Unstoppable with NBK : తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన వెంకీ మామ.. వీడియో వైరల్..!!

ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.. సాంగ్స్ బాగున్నా కానీ దేవిశ్రీ బిజిఎం పై విమర్శలు వచ్చాయి..బిజిఎం సౌండ్ భారీగా ఉండటంతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ వినిపించడం లేదని ప్రేక్షకులు విమర్శించారు.. సౌండ్ లెవెల్ తగ్గించిన అలాగే ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.. 2000 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ కూడా అందుకోలేకపోయింది.. కంగువా ప్లాప్ తో నిరాశలో వున్న ఫ్యాన్స్ ని సూర్య మరో సినిమాతో పలుకరించనున్నాడు.

సూర్య హీరోగా తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతుంది.అయితే తాజాగా నేడు క్రిస్మస్ సందర్బంగా ఈ సినిమా నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు.సూర్య నటిస్తున్న ఈ సినిమాకి “రెట్రో” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. కాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ లో సూర్య.. “నాది స్వచ్ఛమైన ప్రేమ” అనే డైలాగ్ చెప్పడంతో టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది.ప్రస్తుతం ఈ టీజర్ బాగా వైరల్ అవుతుంది..

Related posts

మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

filmybowl

కల్కి 2898 AD : కృష్ణుడిగా మహేష్.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్..?

murali

ఈ మూడు రోజులు అస్సలు సంతోషమే లేదు..మమ్మల్ని క్షమించండి.. సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్..!!

murali

Leave a Comment