Suriya Kanguva has a relation with 24
MOVIE NEWS

కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ?

Suriya Kanguva has a relation with 24
Suriya Kanguva has a relation with 24

Suriya – Kanguva : తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య, శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కంగువా. ఈ సినిమా ని మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయం లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ప్రకటించడం తో కంగువా సినిమాను నవంబర్‌ 14కు వాయిదా వేయడం జరిగింది.

ఇప్పుడు ఈ టైటిల్ చూసి ఈ సినిమా 14 నుంచి 24 కి మారిందా అనుకుంటారేమో అలాంటిదేమి లేదు. 14వ తారీకే సినిమా వస్తుంది అని చిత్ర బృందం ప్రకటించింది.

మరి ఈ కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా…. సరే తెలుసుకుందాం పదండి.

సౌత్ ఇండస్ట్రీలో టైమ్ ట్రావెల్ సినిమాలూ చాలానే వచ్చాయి. దాంట్లో అందరికి గుర్తొచ్చే సినిమా బాలయ్య నటించిన ఆదిత్య 369. మళ్లీ ఆ తర్వాత అంతగా అందరికి గుర్తొచ్చే సినిమా సూర్య నటించిన 24.

టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ తీసిన సినిమా చాలా మంచి పేరు తెచ్చుకోవడమే గాక సూర్య లోని విలన్ ని కూడా ప్రేక్షకులకి పరిచయం చేసింది. ఇక ఇప్పుడు 24 టాపిక్ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారు కదా. కంగువా సినిమా గురించి మీడియాలో బాగా వినపిస్తున్న విషయం ఏంటంటే

ఈ సినిమా ఒక టైమ్ ట్రావెల్‌ కథ అంట, రెండు టైమ్ జోన్ ల మధ్య సాగే ఈ కథ లో సూర్య రెండు చాలా విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. వంద ఏళ్ళ క్రితం కథ ను 2024 కాలానికి కలుపుతూ సాగే కథ తో కంగువా రూపొందినట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న టెక్నాలజీని దాదాపు 100 సంవత్సరాల క్రితమే వినియోగిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కథ ఈ సినిమా లో దర్శకుడు చూయించబోతున్నట్టు తెలుస్తుంది. మాస్ యాక్షన్ సినిమాలను ఇప్పటి వరకు తీసి మెప్పించిన డైరెక్టర్ శివ. ఈ సినిమాను మాత్రం అంతకు మించి అన్నట్లుగా రూపొందించాడు అంటున్నారు.

Read Also : మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

తమిళ్‌ లో భారీ గా రూపొందిన ఈ సినిమా దాదాపు 34 భాషల్లో విడుదల చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక భారతీయ సినిమా ఇన్ని భాషల్లో ఒకే సారి విడుదల అవ్వడం రికార్డు అనే చెప్పాలి. తమిళ్‌ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి దాకా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసే సినిమా రాలేదు. ఆ ఫీట్ ని అందుకునే మొదటి సినిమా కంగువా అని కోలీవుడ్ బలం గా నమ్ముతుంది. ఇక సినిమా మీద అంచనాలు భారీగా ఉండడం తో కంగువా వసూళ్లు ఎలా ఉంటాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సూర్య కు ఇది ల్యాండ్ మార్క్ సినిమా గా నిలిచే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దిశా పటానీ కధానాయిక గా కనిపించనుంది.

Follow us on Instagram

Related posts

ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు మొదలయ్యేది అప్పుడే

filmybowl

మరో రంగస్థలం లో చరణ్ – సమంత….

filmybowl

పుష్ప 2 : కల్యాణ్ బాబాయ్ థాంక్యు..అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

murali

Leave a Comment