కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాలో పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్ సాంగ్ లో నటించింది..ఈ సినిమాలో హాట్ బ్యూటీ శృతి హాసన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తలైవా ‘కూలీ’ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. పూజా హెగ్డే నటించిన ‘మోనికా మై డియర్ మోనికా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ సీన్ లీక్.. వీడియో వైరల్..!!
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్ తెలిపాడు. ”కూలీ కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఇందులో ఎమోషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. రజినీకాంత్ సర్ యాక్షన్‌ను చూపిస్తుంది. ట్రైలర్ విడుదలయ్యే వరకు ఇందులో నటించిన హీరోల లుక్స్ రివీల్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఒక్క ట్రైలర్‌తోనే ప్రమోషన్స్ చాలు అనుకుంటున్నా.దాన్ని ఆగస్టు 2న రిలీజ్ చేయాలనుకుంటున్నాము అని తెలిపారు.
ఈ సినిమాలో నాగార్జున సర్ తన కెరీర్‌లో ఇప్పటివరకూ నటించని పాత్రలో నటించారు.. ఆ పాత్ర కోసం అయన్ను ఒప్పించేందుకు నాకు చాలా సమయం పట్టింది.స్టార్స్ అంతా అద్భుతం గా నటించారు.. కూలీ కమర్షియల్ సక్సెస్ సాధిస్తుంది అని లోకేష్ తెలిపారు.
