ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప2 సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా సంచలన విజయం సాధించింది.. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ భారీగా పెరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇండియన్ సినీ చరిత్రలో టాప్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ లేదు..
VD12 : మ్యాన్ ఆఫ్ మాసెస్ తో రౌడీ స్టార్.. పిక్ అదిరిందిగా..!!
అయితే పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే న్యూస్ బాగా వైరల్ అయింది.అయితే ఏ దర్శకుడితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత మాత్రం లేదు. ఈ విషయంలో బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ముందుగా త్రివిక్రమ్ సినిమా కాకుండా అట్లీతో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.పుష్ప2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అల్లు అర్జున్‌కు అట్లీ కథ చెప్పినట్లు సమాచారం.ఆ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని న్యూస్ బాగా వైరల్ అయింది..
అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసేందుకు అట్లీ డీల్ సెట్ చేసుకున్నాడట.. ప్రస్తుతం ఆ సినిమా కూడా క్యాన్సిల్ కావడంతో అట్లీ టీమ్ కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్‌ను మరోసారి కలిసినట్లు టాక్ వినిపిస్తుంది..దీంతో అల్లు అర్జున్, అట్లీ సినిమా విషయం మళ్ళీ వైరల్ అయింది..అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాలి..