MOVIE NEWS

విష్ణు ‘కన్నప్ప’ కు సూపర్ రెస్పాన్స్.. సినిమా మెయిన్ హైలైట్స్ ఇవే..!!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’…భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఎన్నో అంచనాల మధ్య నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రీమియర్స్ నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టింది.

తలైవా ‘కూలీ’ కి భారీ డిమాండ్.. తెలుగు రైట్స్ ఎవరివంటే..?

ముఖ్యంగా తమిళ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో నాథనాధుడి పాత్రలో తన గంబీరమైన వాయిస్ తో అద్భుతంగా నటించి మెప్పించాడు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మహాదేవ శాస్త్రిగా అదర గొట్టాడు… హీరోయిన్ ప్రీతి ముకుందన్ సైతం తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాకి ఇంతటి క్రేజ్ రావడానికి అసలు కారణం రెబల్ స్టార్ ప్రభాస్. సినిమాలో కీలకమైన 40 నిముషాల ఎపిసోడ్ లో ప్రభాస్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో సినిమాని నిలబెట్టాడు.. ప్రభాస్ డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు.. ప్రభాస్ పెళ్లి డైలాగ్ కి అయితే థియేటర్స్ హోరెత్తాయి. ఇదంతా పక్కనపెడితే సినిమా అంతా విష్ణు అద్భుతంగా నటించాడు..

ఇక క్లైమాక్స్ లో శివయ్య కు తన కన్ను దానం చేసే సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో తన అద్భుతమైన నటనతో మంచు విష్ణు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు.. సినిమాలో సాంగ్స్ తో పాటు బిజిఎం సైతం అదిరిపోయింది.. ఛాన్నాళ్లకు మంచు విష్ణు అదిరిపోయే హిట్ అందుకున్నాడు..

Related posts

ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..?

murali

అఖిల్ ‘లెనిన్’ మూవీ బిగ్ అప్డేట్..శ్రీలీల ప్లేస్ లో ఆ క్రేజీ హీరోయిన్..!!

murali

గేమ్ ఛేంజర్ : ప్రమోషన్స్ కి దూరంగా కియారా.. కారణం అదేనా..?

murali

Leave a Comment