MOVIE NEWS

“ఛావా” తెలుగు ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “ఛావా”.. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా..దివ్యా దత్తా, అక్షయ్ ఖన్నా, అషుతోషి రానా కీలక పాత్రలో నటించారు. ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది…ఈ సినిమానుథియేటర్స్‌లో చూసిన చాలామంది ప్రేక్షకులు శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ యాక్టింగ్ కి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..

ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!!

‘ఛావా’ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ చేయాలనీ నెటిజన్లు డిమాండ్ చేయగా.. వారి కోరిక మేరకు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్’ఛావా’ తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్చానర్‌పై తెలుగు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు.అయితే ఈ అద్భుతమైన సినిమాను తెలుగులో మార్చి 7న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా “ఛావా” తెలుగు వెర్షన్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..అయితే తెలుగు వెర్షన్ డబ్బింగ్ మాస్ హీరో ఎన్టీఆర్ తో చెప్పిస్తారని అంతా భావించారు కానీ అది వార్తగానే మిగిలిపోయింది.. టీజర్ కంప్లీట్ గా మాములు హిందీ సినిమా డబ్బింగ్ ఎలా ఉంటుందో అలాగే వుంది.. అయితే టీజర్ మొత్తం శంభాజీ మహారాజ్ గా విక్కీ యాక్టింగ్ హైలైట్ గా నిలిచింది..

 

Related posts

రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ?

filmybowl

ఒకే స్టేజ్ పైకి పాన్ ఇండియా హీరోలు….

filmybowl

మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా.. రీ రిలీజ్ సినిమాకు ఒక్క టికెట్ మిగల్లేదుగా..!!

murali

Leave a Comment