MOVIE NEWS

వెర్షన్స్ మారుస్తున్న సుకుమార్.. హీరో పాత్రలపై భారీ ప్రయోగాలు..!!

క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆర్య సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ ఆ సినిమాతో తన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. లవ్ స్టోరీని మరింత భిన్నంగా ఎలా చెప్పొచ్చో ఆర్య సినిమాతో దర్శకుడు సుకుమార్ నిరూపించాడు..ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ నే హీరోగా జగడం అనే సినిమా చేసే ప్రయత్నం చేశాడు సుకుమార్. కానీ దిల్ రాజు చెప్పిన కొన్ని మార్పుల వలన జగడం సినిమాలో హీరో రామ్ నటించాడు…

ఆ సినిమాలో కూడా సుక్కు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది..వైలెన్స్ గురించి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది… కానీ దర్శకుడిగా సుకుమార్ రేంజ్ బాగా పెరిగింది. సుకుమార్ సినిమా అంటేనే ఫ్యాన్స్ లో ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సుకుమార్ చేసిన ప్రతీ సినిమాలో కూడా ఏదీ కూడా వల్గర్ గా ఉండదు..ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే స్పెషల్ మూమెంట్స్ ని సుకుమార్ తన సినిమాలో చూపిస్తారు.అయితే సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నారు.

పుష్ప సినిమాకు పార్ట్ 3 అవసరమా..నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!!

పుష్ప సినిమా సుకుమార్ కెరీర్ ని మార్చేసింది.రీసెంట్ గా గా వచ్చిన పుష్ప 2 కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ నమోదు చేసుకుంటుంది.అయితే సుకుమార్ చేసిన పుష్ప  సినిమా కంప్లీట్ గా ఆయన పాత సినిమాలకు భిన్నంగా ఉంది అని చెప్పాలి. సుకుమార్ సినిమాలో హీరోలు చాలా ఇంటెలిజెంట్ గా, స్టైలిష్ గా కనిపిస్తారు. కానీ పుష్ప సినిమాతో సుకుమార్ సరికొత్త హీరో పాత్రని డిజైన్ చేసారు.. దీనితో సుక్కులో దాగి వున్న ఇదివరకు లెక్కల మాస్టారు ఏమైపోయాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ప్రేక్షకులకి బోర్ కొట్టేంత వరకే సుకుమార్ హీరోలు ఇలా వుంటారు.. ఆ తరువాత వెర్షన్ మారుస్తారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

ఒకే స్టేజ్ పైకి పాన్ ఇండియా హీరోలు….

filmybowl

జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..?

murali

పుష్ప 2 :ఆ కీలక సన్నివేశాలు ఎడిట్ చేసిన సుకుమార్.. దాని కోసమేనా..?

murali

Leave a Comment