MOVIE NEWS

తన నెక్స్ట్ మూవీపై సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2′ డిసెంబర్ 5 న గ్రాండ్ గా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది..ఇప్పటికే కేవలం 6 రోజుల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకెంత కలెక్ట్ చేస్తుందో అని అంతా ఆశ్చర్యపోతున్నారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్  ‘పుష్ప2 ‘ సినిమా తో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.టాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ క్రేజ్ ను సుకుమార్ కూడా సంపాదించుకున్నారు.. కెరీర్ ప్రారంభంలో క్లాస్ సినిమాలు తెరకెక్కించిన సుకుమార్ రంగస్థలం సినిమా నుంచి మాస్ బాట పట్టారు..

అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!!

రంగస్థలం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సుకుమార్ అల్లుఅర్జున్ తో పుష్ప వంటి ఊర మాస్ సినిమా తెరకెక్కించాడు.. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప ఫీవర్ ఏవిధంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ‘పుష్ప 2’ చిత్రంతో ఈ లెక్కల మాస్టారు బాక్సాఫీస్ లెక్కలన్నీ సరిచేసాడు..అయితే పుష్ప 2 తర్వాత సుకుమార్ తన తరువాత సినిమా రాంచరణ్ తో చేస్తాడని అంతా ఊహించారు.. కానీ రాంచరణ్ వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో ఆ సినిమా కంటే ముందుగా ఓ డాక్యుమెంటరీని తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది.సుకుమార్ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించడానికి కారణం ఆయన తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమా అని తెలుస్తుంది… పుష్ప కథ అల్లడానికి ఎర్రచందనంపై సుకుమార్ ఎంతో రీసెర్చ్ చేసారు..

ఎర్ర చందనం అసలు ఎక్కడ పెరుగుతుంది..దానిని ఎలా సేకరించాలి..ఎలా అక్రమంగా రవాణా చేస్తున్నారు..ఈ ఎర్రచందనమంతా అసలు ఎక్కడికి వెళుతుంది.వంటి విషయాలపై సుకుమార్ బాగా రీసెర్చ్ చేసారు..కానీ ‘పుష్ప’ సినిమాలో సుకుమార్ మొత్తం సమాచారాన్ని కథలో చేర్చలేకపోయాడు. అందుకే ఇప్పుడు ఎర్రచందనంపై డాక్యుమెంటరీ తీసేందుకు సుకుమార్ సిద్ధం అయ్యారని తెలుస్తుంది.. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం సుకుమార్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఎర్ర చందనం స్మగ్లింగ్ చరిత్ర,అలాగే వాటిని సేకరించే కార్మికుల జీవితం తదితర అంశాలను ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ డాక్యుమెంటరీ విడుదల కానున్నట్లు సమాచారం..

Related posts

సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!!

murali

రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!!

murali

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

Leave a Comment