MOVIE NEWS

సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!!

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా”.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. దీనితో  2000 కోట్లు సాధిస్తుంది అనుకున్న మేకర్స్ కి కంగువా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. ఈ సినిమా కోసం హీరో సూర్య ఎంతో కష్టపడ్డాడు..కానీ ఫలితం మాత్రం రాలేదు.ఇదిలా ఉంటే సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన తరువాత సినిమా చేసాడు..ఈ సినిమా టైటిల్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!!

సూర్యకి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది…కంగువా సినిమా ద్వారా ఆ విజయాన్ని సాధించవచ్చని ఆయన ఆశించారు. కానీ కంగువా సినిమా సూర్య కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కార్తీక్ సుబ్బరాజు మూవీపైనే సూర్యఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమాను ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నటుడు సూర్య ఓన్ ప్రొడక్షన్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు..

వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. సూర్య 44 సినిమా టైటిల్ కూడా త్వరలో విడుదల కానుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు ‘కల్ట్’ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం..అయితే నెటిజన్లు ఇప్పటికే కంగువా దెబ్బ సరిపోలేదా… మళ్ళీ ‘క’ టైటిలా అని ట్రోల్ చేస్తున్నారు.. అయితే ‘కల్ట్’ అనే టైటిల్‌ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండటంతో ఈ టైటిల్ పెట్టే అవకాశం దాదాపు లేనట్లే అని తెలుస్తుంది ..

Related posts

అఖండ 2 తాండవం…. అదరహో….

filmybowl

తెలుగు సినిమా అభిమానుల మధ్య మళ్ళి రాజేసుకున్న కలెక్షన్స్ కుంపటి.

filmybowl

ఆ టాలెంటెడ్ దర్శకుడికి దిల్ రాజు ఛాన్స్ ఇస్తున్నాడట

filmybowl

Leave a Comment