MOVIE NEWS

SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి సరికొత్త ప్రయోగం..!!

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం మహేష్ ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు..ఈ సినిమా కోసం మహేష్ లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు.. ఈ సినిమా షూటింగ్ సైతం ఎంతో సీక్రెట్ గా ప్రారంభం అయింది..సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. 2027 చివరి నాటికీ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.అయితే దర్శకుడు రాజమౌళి ఏది చేసినా అందులో ఓ స్పెషాలిటీ ఉంటుంది.

ఎన్టీఆర్ -త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ అందుకే వాయిదా వేసాం.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

రాజమౌళి తన ప్రతీ సినిమాలో కొందరిని రిపీట్ చేస్తుంటారు. సినిమాటోగ్రాఫర్ ను, మ్యూజిక్ డైరెక్టర్ ను, కొందరు నటులు, ఇంకొందరు టెక్నీషియన్లను ఎప్పుడూ కంటిన్యూ చేస్తుంటాడు..మహేశ్ బాబుతో చేసే సినిమాకు మాత్రం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. ఈ సినిమా కోసం అందరినీ కొత్తవారినే తీసుకుంటున్నారు.. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తాజాగా బయట పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెంథిల్.. రాజమౌళి సినిమాకు ఎందుకు పనిచేయట్లేదో చెప్పారు. ఈ సినిమాకు రాజమౌళి అందరూ కొత్త వారినే తీసుకుంటున్నారు. అందుకే నేను ఈ సినిమాకు పనిచేయట్లేదు. భవిష్యత్ లో మేం కలిసి పని చేస్తాం అని ఆయన తెలిపారు..

అయితే రాజమౌళి ఎందుకు అందరినీ కొత్త వారినే తీసుకుంటున్నాడనేది ఇక్కడ ప్రశ్నగా మారింది.. మహేశ్ తో చేయబోయే మూవీ ప్రపంచ వ్యాప్తంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడట జక్కన్న.సినిమాను చాలా రిచ్ గా విజువల్ వండర్ గా తెరకెక్కించనున్నారు.సినిమాకు సరిగ్గా సరిపోయే స్థాయి టెక్నాలజీ కోసం ఎవరు వర్కౌట్ అయితే వారినే తీసుకుంటున్నాడట జక్కన్న. టెక్నీషియన్లను సైతం స్పెషల్ గా సెలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం… నటీనటులను కూడా తెలుగు నుంచే కాకుండా బయటి వారినే ఎక్కువగా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు..

Related posts

మెగాస్టార్ కల్ట్ క్లాసిక్.. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా..?

murali

రాజాసాబ్ : తమన్ వర్క్ డార్లింగ్ కు నచ్చలేదా..?

murali

ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ స్టార్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మావ..?

murali

Leave a Comment