MOVIE NEWS

SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ దర్శకుడిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక దర్శకుడిగా ప్రతీ సినిమాకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న రాజమౌళి తాను ఏం చేసినా భవిష్యత్ ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమా కోసం రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ తీసుకొచ్చారు.. ఇప్పుడు మరొక దానిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే తెలుగు నిర్మాణ సంస్థలతో మూవీ చేస్తే ప్రతిసారి ఫారిన్ కేటగిరీలో నామినేషన్స్ వేయాల్సి వస్తోందటా. అప్పుడు ఆస్కార్ అవార్డుల అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి.

ఈ ఐదేళ్లు అలా గడిపేశా.. నిధి అగర్వాల్ ఎమోషనల్..!!

ప్రస్తుతం మహేశ్ తో చేస్తున్న మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కెఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.తెలుగు బ్యానర్ మీద కాకుండా హాలీవుడ్ బ్యానర్ ను మెయిన్ నిర్మాణ సంస్థగా చూపించేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం… అందుకోసం హాలీవుడ్ కు చెందిన పలు నిర్మాణ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థను మొదటి ప్రొడ్యూసర్ గా చూపించి కేఎల్ నారాయణను రెండో సంస్థగా చూపించనున్నట్లు సమాచారం..

అప్పుడు హాలీవుడ్ కోటాలో నేరుగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వొచ్చు..దానితో ఎక్కువ విభాగాల్లో ఆస్కార్ కు నామినేషన్స్ వేయొచ్చు. కానీ మూవీని డబ్ చేయకుండా డైరెక్ట్ గా ఇంగ్లిష్ లోనే తీయాలి. అలా చేస్తే బడ్జెట్ మరింత పెరిగే అవకాశం వుంది.ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఓ భారీ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం..

Related posts

ఫారెన్ వీధుల్లో సామాన్యుడిలా ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

murali

ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..?

murali

నాని ” ది ప్యారడైజ్”ఇంట్రెస్టింగ్ అప్డేట్..వైరల్..!!

murali

Leave a Comment