సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పాన్ వరల్డ్ మూవీ ‘SSMB29’.. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ హీరో కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ మూవీకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో విజయేంద్ర ప్రసాద్ అద్భుతంగా డిజైన్ చేసినట్లు సమాచారం..ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు… తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.’SSMB29′ మూవీ కంప్లీట్ అడ్వంచర్ జోనర్ లో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదని ఆయన అన్నారు. అలాగే మహేష్ బాబు కెరియర్ లో కూడా ఫస్ట్ టైం ఇలాంటి జోనర్ లో సినిమా చేస్తున్నారని విజయేంద్రప్రసాద్ తెలిపారు…
కన్నప్ప : ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!
ఈ కథ సిద్ధం చేసుకున్నప్పుడు మహేష్ బాబు ఈ జోనర్ లో ఇది వరకు సినిమాలు చేశాడా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నామని ఆయన అన్నారు.అలాగే ఈ సినిమా , కథపై చాలా కసరత్తు చేసి చివరికి అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశామని ఆయన అన్నారు. కచ్చితంగా ఈ సినిమా సరికొత్త అడ్వెంచరస్ ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకి అందిస్తుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు…
మహేష్ కి వున్న ఇమేజ్ ఈ కథను ఏ మాత్రం డామినేట్ చేయదని ఆయన అన్నారు.. కథా బలంతోనే రాజమౌళి మూవీస్ సక్సెస్ అవుతున్నాయని ‘SSMB 29’కి కూడా మరో సంచలనం సృష్టిస్తుందని ఆయన అన్నారు.. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయ్యింది. ప్రియాంక చోప్రా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కెన్యాలో మెజారిటీ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం..