MOVIE NEWS

SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!!

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌ బాబు కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ సరసన హాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా గురించి రాజమౌళి ఎలాంటి లీక్స్ లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు..

ఎన్టీఆర్ “డ్రాగన్” రాక మరింత ఆలస్యం కానుందా..?

ఈ సినిమా పూజా కార్యక్రమం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా కానిచ్చేసారు.. అలాగే షూటింగ్ సైతం రాజమౌళి సీక్రెట్ గా మొదలు పెట్టారు..ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన మొదటి షెడ్యూల్ హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో జరిగింది. ఆ షూట్ నుంచి సింగిల్ పిక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మీద షూట్ చేసిన ఈ షెడ్యూల్ పూర్తి కాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఒడిశాకు పయనం అయింది.

అక్కడ జరిగే షెడ్యూల్ లో ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని గత కొంతకాలంగా న్యూస్ వైరల్ అవుతుంది.. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంపై ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే త్వరలో ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలియజేయనున్నారు..

 

Related posts

గేమ్ ఛేంజర్ : ఆ రెండు ట్విస్టులతో ప్రేక్షకులు స్టన్ అవ్వడం గ్యారెంటీ..!!

murali

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

murali

అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!!

murali

Leave a Comment