దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా కూడా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.మహేష్ బాబు మొదటి పాన్ ఇండియా సినిమా కావడం అలాగే ఆర్ఆర్ఆర్ వంటి ఇంటర్నేషనల్ హిట్ అందుకున్న రాజమౌళి తరువాత చేస్తున్న భారీ సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..?
ఇప్పటికే మహేష్,రాజమౌళి సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. లొకేషన్స్ కూడా రాజమౌళి ఓకే చేసారు..ఈ సినిమా కోసం పలు వర్క్ షాప్స్ కూడా నిర్వహించారని తెలుస్తుంది..మహేష్ ఈ సినిమా కోసం కొన్ని స్పెషల్ ట్రైనింగ్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం..ఈ సినిమా ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఈ సినిమాని హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకపోయినా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అయితే పూజా కార్యక్రమం జరుగుతుందని లీకుల ద్వారా సమాచారం బయటకి రావడమే కానీ చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రాజమౌళి, మహేష్ ఈ గ్రాండ్ పూజా కార్యక్రమానికి వెళ్లిన వీడియోలు బయటకు వచ్చాయి.. ఇంతటి భారీ సినిమా పూజా కార్యక్రమాన్ని కనీసం ప్రకటన కూడా లేకుండా నిర్వహిస్తున్నారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..కానీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తున్నారు..SSMB29, SSMBXSSRGloryBegins అనే హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు… పూజా కార్యక్రమానికే ఫ్యాన్స్ ఇంత హడావుడి చేస్తున్నారంటే మరి సినిమా రిలీజ్ రోజు రచ్చ ఏ విధంగా ఉంటుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..