MOVIE NEWS

ఎస్ఎస్ఎంబి : రెండు పార్టులుగా మహేష్ సినిమా..రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయి మంచి విజయం సాధించింది.. ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో చేయనున్న సంగతి తెలిసిందే.. “ఎస్ఎస్ఎంబి” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని పూర్తిగా చేంజ్ చేసే పనిలో వున్నారు.. రీసెంట్ గా లాంగ్ హెయిర్, గుబురు గడ్డం తో కనిపించిన మహేష్ తాజాగా లుక్ చేంజ్ చేసి కనిపించారు.

ముందుగా ఫ్యాన్స్ అంతా ఆ లుక్ కన్ఫామ్ అనుకున్నారు.. కానీ మహేష్ లుక్ చేంజ్ చేయడం తో రాజమౌళి ఇంకా మహేష్ లుక్ ని ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.. ఇదిలా ఉంటే ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె. ఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా కథ ఇప్పటికే పూర్తి అయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తెలిపారు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి భారీ లొకేషన్స్ కోసం రాజమౌళి వేట కొనసాగిస్తున్నాడు..

పుష్ప 2 : పాట్నా ఈవెంట్ పై సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!

ఈ సినిమా బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా మేకర్స్ తెరకేక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి భారీ ప్రెస్ మీట్ నిర్వహించి దర్శకుడు రాజమౌళి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేయనున్నాడు..ఆ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..ఎస్ఎస్ఎంబి సినిమాను రాజమౌళి రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి..వచ్చే నెలలో నే ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం..

Related posts

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

murali

పుష్ప 2 : అదనంగా మరో 20 నిముషాలు.. మేకర్స్ స్ట్రాటజీ అదిరిందిగా..!!

murali

Nandamuri Bala Krishna : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

filmybowl

Leave a Comment