MOVIE NEWS

ఎస్ఎస్ఎంబి : వర్క్ షాప్ లో మహేష్.. పిక్ అదిరిందిగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అందులోను మహేష్ హీరోగా నటిస్తుండటంతో సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితం చాలా సీక్రెట్ గా జరిగాయి.ఆ కార్యక్రమంకి సంబంధించి ఎలాంటి పిక్ గానీ.. వీడియో గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. మేకర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు..ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగ్గా.. రెగ్యులర్‌ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే..?

కానీ రీసెంట్ గా జక్కన్న.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే.క్యాప్చర్డ్‌ అంటూ సింహాన్ని లాక్‌ చేసినట్లు అర్థం వచ్చేలా ఓ వీడియోను పోస్ట్ చేశారు.వీడియోలో రాజమౌళి పాస్ పోర్ట్ పట్టుకుని నవ్వడం.. బ్యాక్ గ్రౌండ్ లో మహేష్ స్పైడర్ మూవీ మ్యూజిక్ ను యూజ్ చేయడంతో అంతా చర్చనీయాంశంగా మారింది. నిజానికి మహేష్ ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ వెళ్తుంటారు. అందుకే సరదాగా ఇప్పుడు మహేష్ పాస్ట్ పోర్ట్ ను తీసుకుని బందీని చేసినట్లు రాజమౌళి సరదాగా  ఆ వీడియో పోస్ట్ చేసారు..

అదే సమయంలో మహేష్ కూడా.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను అంటూ క్రేజీగా రిప్లై ఇచ్చారు. అలా రాజమౌళి పోస్ట్ అండ్ మహేష్ కామెంట్ వైరల్ అవుతుండగా.. సడెన్ గా  మహేష్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..SSMB మూవీ వర్క్ షాప్ లో మహేష్ దిగిన పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.హైదరాబాద్ లింగంపల్లి సమీపంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో SSMB  వర్క్ షాప్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా పలువురు పాల్గొన్నట్లు సమాచారం..అందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పిక్ బాగా వైరల్ గా మారింది.

 

Related posts

మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చిన రాజమౌళి.. మీమ్స్ తో తెగ రచ్చ చేస్తున్నారుగా..!!

murali

లైగర్ కష్టం ఎక్కడకి పోలేదు….

filmybowl

గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!!

murali

Leave a Comment