సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “ గుంటూరు కారం “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ “ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది..ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు..బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా లతో డైరెక్టర్ రాజమౌళి రేంజ్ ప్రపంచస్థాయికి చేరింది.రాజమౌళి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు సాధించడంతో రాజమౌళి క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది..ప్రస్తుతం ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే తన నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో ఉంటుందని ఆయన ప్రకటించాడు. దీంతో వీరిద్దరి కాంబో పై ప్రేక్షకులలో మంచి హైప్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ కావడంతో రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించనున్నారు.’ఎస్ఎస్ఎంబి’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.
గేమ్ ఛేంజర్ : భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. స్పెషల్ గెస్టులుగా ఆ స్టార్ డైరెక్టర్స్..!!
ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ బాగా వైరల్ అవుతుంది… ఈ సినిమాలో నటించే స్టార్ హీరోయిన్ ఎవరనే విషయం పై ప్రేక్షకులలో బాగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హాలీవుడ్ బడా స్టార్స్ నటిస్తారని న్యూస్ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ పేర్లు పరిశీలించిన చివరికీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్లు సమాచారం ..