దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.. ఏకంగా ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే సొంతం.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు..”SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్లో 29 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు…సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ మొత్తం ఈ షెడ్యూల్ లో పాల్గొనగా అందులో మహేష్ కు సంబంధించిన ఓ వీడియో రీసెంట్ గా లీకవడంతో చిత్ర యూనిట్ రూల్స్ మరింత కఠినం చేసింది… సెట్స్ లోకి ఒక్క ఫోన్ కనిపించిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేలా రాజమౌళి టీం చర్యలు తీసుకుంటుంది.ఎప్పుడు లేని విధంగా రాజమౌళి స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.
“రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సినిమాను ఎలాగైనా సంవత్సరంన్నర లో పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాగైనా టైమ్ పడుతుంది కాబట్టి షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి చూస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.సినిమాలో మహేష్ పాత్ర కాశి లో మొదలవుతుందని సమాచారం.మహేష్ పాత్ర కాశీ నుంచి మొదలై ఆ తర్వాత అడవులకు వెళ్తుందట. అందుకే హైదరాబాద్ లో స్పెషల్ గా మణికర్ణిక ఘాట్ ను సెట్ వేస్తున్నారు.. ఆల్మోస్ట్ ఆ సెట్ వర్క్ కూడా పూర్తైనట్టు సమాచారం. మహేష్ అడవులకు వెళ్లడానికి గల కారణం కూడా కాశీతోనే ముడిపడి ఉంటుందని తెలుస్తుంది
రామాయణంలో ఆంజనేయుడి పాత్ర స్పూర్తితో రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాసుకున్నారని, అసలు మహేష్ అడవులకు ఎందుకు వెళ్లాడనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో మహేష్ బాబు తో పాటూ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ భారీ ప్రెస్ మీట్ పెట్టనున్నారు..