సూపర్ స్టార్ మహేష్,రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఎంతో గ్రాండ్ గా ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి లీక్స్ లీక్స్ లేకుండా చూడాలని రాజమౌళి టీం స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేసిన సోషల్ మీడియా లో ఈ చిత్రానికి సంబంధించిన లీకులు ఆగడం లేదు.రాజమౌళి ఈ లీక్స్ పై రీసెంట్ గానే చాలా ఫైర్ అయ్యాడని తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది..
OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..?
ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా ఎవరో మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. అది అప్లోడ్ అయినా నిమిషాల వ్యవధి లోనే ఫుల్ వైరల్ అయింది..షూటింగ్ లొకేషన్స్ ఆవరణలో మొబైల్ ని ఉపయోగించకూడదని రాజమౌళి ఎంత వారించిన ఇలా జరగడంతో ఈ సారి నిబంధనలు మరింత కఠినం చేసినట్లు తెలుస్తుంది..
ఈ రూల్స్ కేవలం మూవీ యూనిట్ కి మాత్రమే కాదు, హీరో మహేష్ బాబుకి, ప్రియాంక చోప్రాకి, పృథ్వీ రాజ్ లకు కూడా వర్తిస్తుందట.. మహేష్ బాబు కూడా అందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం.. అయితే ప్రియాంక చోప్రా నిన్నటి నుండి షూటింగ్ లో పాల్గొంటుంది. ఆమె ఒడిశా విమానాశ్రయం కి చేరుకున్న సమయంలో కొంతమంది అభిమానులు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. అంతే కాకుండా ప్రియాంక చోప్రా ఒడిశా లోని అడవుల చుట్టూ ఉన్నటువంటి కొన్ని అందమైన ప్రదేశాలను ఫోటోలు తీస్తూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ లొకేషన్స్ బాగా వైరల్ అవుతున్నాయి..