MOVIE NEWS

SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..?

 

దర్శక ధీరుడు రాజమౌళి,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో  బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..బిగ్గెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..మహేష్ కెరీర్ లో ఈ సినిమా 29వ సినిమాగా తెరకెక్కుతుంది.SSMB 29 మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..

తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం అదేనా..?

ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయినా ఫ్యాన్స్ మాత్రం నిరాశలోనే వున్నారు.కారణం ఏమిటంటే ఇప్పటి దాకా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరోవైపు సైలెంట్ గా జనవరి నెల మొదట్లోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలను మొదలు పెట్టి శర వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేశారు. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా నటీనటులను ఎంపిక చేసి, ఒక్క లీక్ కూడా లేకుండా షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నారు.రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రాజమౌళి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

మొదటి షెడ్యూల్ షూటింగ్ ఫిబ్రవరి 3తో పూర్తవుతుంది అని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ప్రియాంక చోప్రా ముంబైకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగింపు దశలో ఉండగానే రాజమౌళి సెకండ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసారని సమాచారం… మొదటి షెడ్యూల్ పూర్తి అయిన తరువాత కొంత బ్రేక్ తీసుకోని ఫిబ్రవరి చివరి వారంలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం..

 

Related posts

పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

filmybowl

మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చిన రాజమౌళి.. మీమ్స్ తో తెగ రచ్చ చేస్తున్నారుగా..!!

murali

బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి

filmybowl

Leave a Comment