MOVIE NEWS

SSMB : రాజమౌళి టీం కు వార్నింగ్ ఇచ్చిన కెన్యా గవర్నమెంట్.. కారణం అదేనా..?

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను రాజమౌళి గ్రాండ్ గా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే… త్వరలోనే ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ ఇవ్వడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను మేకర్స్ ఫైనల్ చేశారు. రీసెంట్ గా ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ కూడా ఇచ్చేసింది. ఆమెకు దాదాపు 30 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధం అయినట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు 16 నెలల డేట్స్ ను రాజమౌళి అడిగినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!!

ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతుందటంతో ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా త్వరలోనే విజయవాడలో కూడా షూటింగ్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సినిమా షూటింగ్ కెన్యాలో జరగనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తికేయ కెన్యా వెళ్లినట్లు సమాచారం.సినిమా షూటింగ్ స్పాట్స్ కు సంబంధించి కార్తికేయ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం వెళ్లినట్లు తెలుస్తుంది.కెన్యాలోని నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. దీనితో అక్కడి ప్రభుత్వానికి ఇప్పటికే రాజమౌళి టీం అప్లికేషన్ కూడా పెట్టుకుందిని సమాచారం…

అయితే కెన్యా గవర్నమెంట్ రాజమౌళి టీంకు  చిన్న వార్నింగ్ ఇచ్చిందట. నేషనల్ పార్కులో జంతువులను చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారని వాళ్లకు గాని అలాగే  అక్కడ ఉన్న అడవి జంతువులకు గాని ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని తెలిపింది..ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే భారీగా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

 

Related posts

“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!

murali

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!!

murali

డాకు మహారాజ్ : అసలు విలన్ ఆయనే..బాలయ్య ఫ్యాన్స్ కి బాబీ బిగ్ సర్ప్రైజ్ ..!!

murali

Leave a Comment