MOVIE NEWS

SSMB : మహేష్ లేటెస్ట్ లుక్ చూసారా.. మాములుగా లేదుగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB” అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..మహేష్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు.. ఇప్పటికే ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి త్వరలోనే ఓ భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం.. అయితే గతంలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది అనగా మహేష్ డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు..

ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!!

లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మహేష్ లుక్ అదిరిపోయింది.. కానీ ఆ తరువాత గడ్డం ట్రిమ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.. దానితో అందరూ ఆ లుక్ ఫైనల్ కాలేదేమో అని భావించారు..తాజాగా మహేష్ వర్కౌట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.మహేష్ జిమ్‌లో అద్దం ముందు చూసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని కథ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే..అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రీరికార్డింగ్ పనులు మొదలు పెట్టారు… ఈ సినిమా కోసం మహేష్ తన లుక్స్ మొత్తం పూర్తిగా మార్చేశారు.

తాజాగా లీక్ అయిన జిమ్‌లోని వీడియో లో మహేష్ ఒక హల్క్ మాదిరిగా కనిపించాడు. జిమ్‌లో వర్కౌట్స్ చేసి బాడీని పెంచుతున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఫుల్ ఖషీ అవుతున్నారు.సింహం సిద్ధం అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది..

Related posts

విశ్వంబర సినిమా లో అ….అ…అ

filmybowl

డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!

murali

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ఆరు సినిమాలు అప్డేట్స్ తో రెడీ !

filmybowl

Leave a Comment