సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా షూటింగ్ దర్శకుడు రాజమౌళి ఎంతో సీక్రెట్ గా ప్రారంభించారు..ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ ని కూడా మేకర్స్ పూర్తి చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.త్వరలో ప్రారంభం కాబోయే మూడో షెడ్యూల్ ను సైతం రాజమౌళి మరింత భారీగా ప్లాన్ చేయబోతున్నాడు… మహేష్ సైతం రాజమౌళి సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.
ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..?
అయితే ఈ సినిమాలో సమహేష్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ అడిగినప్పుడు కాకుండా తన సినిమాకు బజ్ తెచ్చే సమయంలో మాత్రమే రాజమౌళి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తారు. తాను ఏం చేసినా ప్రపంచమంతా చర్చించుకునేలా రాజమౌళి ప్లాన్ చేస్తాడు..ఇప్పుడు ఫ్యాన్స్ కోసం అలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట..SSMB29 మూవీ లో మహేష్ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ ను రిలీజ్ చేయాలనే విషయంపై జక్కన్న బాగా డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం..
ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ అయ్యారని సమాచారం. మహేష్ బాబు ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ డే అయిన మే 31 న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం… త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది.. అలాగే మలయాళం స్టార్ పృద్వి రాజ్ సుకుమారాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు..