
Srinu Vaitla Mahesh Babu : వెంకీ దుబాయ్ శ్రీను ఢీ, రెడీ, దూకుడు చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టి ఆగ్ర దర్శకుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు శ్రీను వైట్ల కానీ ఆగడు చిత్రం ప్లాప్ అవ్వడం తో ఆయన కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వైట్ల చాలా ఏళ్ళు ఎవరికీ కనిపించకుండా పోయాడు. ఆగడు తర్వాత ఎన్ని సినిమాలు చేసినా శ్రీను వైట్ల కు కలిసి రాలేదు హిట్ పడలేదు.
కెరీర్ సంగతి అలా ఉంచితే పర్సనల్ లైఫ్ లోను ఇబ్బందులు పడ్డాడు. భార్యతో గొడవలు అన్ని కలిసి శ్రీని వైట్లని కిందకి పడేశాయి.
ఇప్పుడు తాజాగా శ్రీను వైట్ల మాచో స్టార్ గోపీచంద్ తో చేస్తున్న చిత్రం విశ్వం విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా వైట్ల మీడియా తో చాలా విషయాలు పంచుకున్నాడు.
తాను రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ పెట్టి సినిమాలు పట్టించుకోలేదు అనేది అవాస్తవం అని వాస్తు పై నమ్మకం పెరిగిపోయి ఇల్లులు మారుకుంటూ వస్తున్న అని ఏవేవో అంటున్నారు . కానీ నేను అవేమి నమ్మను, నాకు రియల్ ఎస్టేట్ చేసే అంత సామర్ధ్యము లేదు అంత డబ్బులు నేను వెనకేసుకు లేదు అంటూ చెప్పారు శ్రీను వైట్ల.
Read Also : దేవర డే 5 కలెక్షన్స్ – నిన్న మళ్ళి పెరిగాయి
దూకుడు తర్వాత మహేష్ తో సినిమా అనగానే అంచనలు బాగా పెరిగిపోయాయి అని దాన్ని అందుకోడం లో విఫలమయ్యాను అని. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మొత్తం బాధ్యత తనదే అని చెప్పుకొచ్చారు.
నా కెరీర్ లో పొరపాటు చేసాను అంటే అది ఆగడు సినిమానే. సూపర్ స్టార్ మహేష్ తో ముందు అనుకున్న కథ వేరు, ఆ తర్వాత అంత భారీ బడ్జెట్ కథ నిర్మాతలకు ఇబ్బంది అవుతుందని భావించి, మరో కథను అప్పటికప్పుడు వండామ్. ఆగడు సినిమా కోసం కూడా నా ప్రతి సినిమా కి కష్టపడే స్థాయిలో కష్టపడ్డాము. కానీ దూకుడు హిట్ తరువాత పెరిగిన అంచనాలు అందుకోవడంలో ఆగడు ఫెయిల్ అయ్యింది.
ఇప్పటికి నేను ఆగడు సినిమా గురించి రిగ్రెట్ ఫీల్ అవుతుంటా కానీ మహేష్ మాత్రం నాతో ఎప్పటి లాగే చాల ఫ్రెండ్లీ గా ఉంటాడని చెప్పుకొచ్చారు.
మహేష్ – రాజమౌళి సినిమా చాలా బాగా ఆడుతుందని మహేష్ రేంజ్ పాన్ వరల్డ్ కి ఎదగాలని కోరుతున్నట్లు చెప్పారు.
Follow us on Instagram