MOVIE NEWS

బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!!

డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా బాగా పాపులర్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ లో స్పెషల్ సాంగ్ అయిన ‘కిస్సిక్’ సాంగ్‌తో ఈ భామ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..తాజాగా ఈ భామ బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయింది.అయితే ఈ షోకి ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్ళింది.. ఆ యంగ్ హీరో ఎవరో కాదు జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో నవీన్ పోలిశెట్టి హీరోగా ‘అనగనగా ఒక రాజు’ సినిమా మొదలైంది.. ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించాల్సి ఉంది… కానీ అది కుదరలేదు. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే టాక్ కూడా ఉంది. త్వరలో ఈ కాంబో సెట్ అవుతుందని సమాచారం..

బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!!

తాజాగా అన్‌స్టాపబుల్ షోకి నవీన్, శ్రీలీల హాజరయ్యారు.సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాబుల్ సీజన్ 4లో నవీన్, శ్రీలీలతో రచ్చ చేయనున్నారు. త్వరలో ఆహాలో స్ట్రీమింగ్‌కు రానున్న ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీలీలకు మరో బంపరాఫర్ వచ్చినట్టు సమాచారం.. తెలుగులో ప్రస్తుతం రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.గతంలో దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీను సంప్రదించగా ఆమె నో చెప్పారు.అయితే ఈసారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది..

యంగ్ హీరో శివ కార్తికేయన్‌ కి జోడిగా ఈ భామ ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది.శివ కార్తికేయన్‌ ఇటీవల అమరన్‌ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పురనానూరు’ టైటిల్‌తో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఫైనల్ అయినట్టు సమాచారం..త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తుంది..

Related posts

జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..?

murali

అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

murali

గేమ్ ఛేంజర్ : భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. స్పెషల్ గెస్టులుగా ఆ స్టార్ డైరెక్టర్స్..!!

murali

Leave a Comment