Sree Vishnu Swag Movie Full Review
MOVIE REVIEWS

శ్రీ విష్ణు స్వాగ్ తో హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసాడా? లేదా ?

Sree Vishnu Swag Movie Full Review
Sree Vishnu Swag Movie Full Review

Swag Movie Review : మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం
తారాగణం: శ్రీ విష్ణు, రీతూ వర్మ, దక్షా నాగర్కర్ , మీరా జాస్మిన్, శరణ్య, సునీల్, రవిబాబు, గెట్ అప్ శ్రీను తదితరులు
ప్రొడక్షన్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
ప్రొడ్యూసర్స్: టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల

రైటర్ & డైరేక్షన్: హసిత్ గోలీ
మ్యూజిక్: వివేక్ సాగర్
రిలీజ్ డేట్: 4 , అక్టోబర్, 2024
శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలీ దర్శకత్వంలో స్వాగ్ చిత్రం రూపుదిద్దుకుంది. రాజ రాజ చోర లాంటి హిట్ తర్వాత హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ఇది. ఈచిత్రంలో శ్రీవిష్ణు నాలుగు పాత్రలు పోషించాడని ట్రైలర్‌లో చూపించారు. పైగా రాజుల కాలం సినిమా అనడం తో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి చిత్ర బృందం ఆ అంచనాలని అందుకుంది లేదా తెలుసుకుందాము.
కథ:
1551 సంవత్సరం లో జరిగే కాలం నుండి సినిమా మొదలెట్టాడు దర్శకుడు. మాతృస్వామ్య ఒక కుటుంబంలో అనగదొక్కబడి వున్న స్వగానిక వంశానికి చెందిన మహారాజు గా శ్రీవిష్ణు కనిపిస్తారు. ఏ రోజుకైనా పురుషుడి అధిపత్యం రావాలని తపిస్తుంటాడు. ఎప్పటికైనా తన వారసత్వం నిలబడాలని కలలు కంటుంటాడు. అనుకున్నటే తనకి కొడుకు పుట్టడం తో తన హయం నుండి పితృస్వామ్య పాలన మొదలుపెడతాడు .
మాయాతి, భవభూతి, సింగరేణి (సింగ) వీళ్లందరు ఆ కుటుంబానికి సంబంధించిన మిగత తరాల వ్యక్తులు. మాయాతి, భవభూతి ఇద్దరు పురుషాధిక్యం చూపిస్తుండడం తో ఆ కుటుంబంలో గొడవలు మొదలై సంబంధాలు తేగిపోతాయి.
ఇక ఈ వంశానికి సంబందించిన సొమ్ములు దక్కాలంటే నేటితరం లోని వారసుడిని కనిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకోసం అందరు వెతుకులాట మొదలెడతారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అయిందా? రాజుల సొమ్ములు ఎవరికి సొంతం అయ్యాయి ? కథ మధ్యలో వచ్చే విభూతి ఎవరు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా వుంది:
కథ నీ దర్శకుడు ఎంత గొప్పగా అయినా రాసుకొని కానీ దాన్ని రిక్లైనర్ సీట్ లో కూర్చోని సినిమా చూసే ప్రేక్షకుడికే కాదు…. నేల మీద కూర్చోని సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా అర్ధం అవ్వాలి. అలా అర్ధం అవ్వకపోతే ఆ కథ ఎంత గొప్పదైన పెద్దగా ఉపయోగం ఉండదు . ఒక మామూలు కథ ని తీసుకొని అర్ధవంతంగా నువ్వు ప్రేక్షకుడికి చెప్తే దర్శకుడు పాస్ అయిపోయినట్టే.

ఈ కథ లో దరకుడు చాలా మంచి పాయింట్ చెప్పాలనుకున్నాడు. మనసుని మెలిపెట్టే ఎమోషన్ ఉంది ఐనా ఎం ఉపయోగం. కథ చెప్పిన విధానం మొత్తం గందరగోళమే. ఏ పాత్ర ఎక్కడ మొదలైంది, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది ఎవరికీ అర్ధం అవ్వదు అంటే తప్పు కాదు. కామెడీ సినిమాలని ఎంతో ఈజ్ తో చేసే శ్రీవిష్ణు ఈ సినిమా లో రాకరకాల గెట్ అప్స్ వేసాడు. విచిత్రమైన స్లాంగ్ లో మాట్లాడాడు, కామెడీ చేసాడు కానీ ఏది ప్రేక్షకుడికి రిజిస్టర్ అవ్వలేదు అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు సినిమా ఎలా వెళ్లిందో.
మొదటి సగం అంతా రాజ్యం, వంశం, రాజులు, పితృస్వామ్యం, మాతృస్వామ్యం ఇదే దృశ్యాలు. హీరో & హీరోయిన్ వంశాలే నిండుగా వుంటారు అలాంటిది రాజ్య ఖజానాని పరిరక్షించే వాళ్ళ వంశం వివరాలు చెబుతుంటే అది ఇంకా తికమక వ్యవహారం అనే చెప్పాలి.

ఇక రెండో భాగం సాగుతున్నప్పుడు ప్రేక్షకుడు కాస్త సినిమాలో లీనమౌతాడు. ఎందుకంటె మొదటి సగం తో సంబంధం లేకుండా ఒక కొత్త పాత్ర ని తీసుకురావడం. ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న కథ , పాత్రలు చాలా బావుంటాయి. ట్రాన్స్ జెండర్ చుట్టు అల్లిన సన్నివేశాలు సినిమా కి హైలైట్ అనే చెప్పాలి , వాటిల్లో పండిన ఎమోషన్ సినిమాకి పెద్ద బలం.

ఈ ఆలోచనలతో కాంచన సినిమా వచ్చింది. ఆ సినిమా లో చూసిన దాని కంటే ఈ సినిమా లో దర్శకుడు లింగ సమానత్వం గురించి చాలా బాగా చెప్పాడు. మొదటి సగాన్ని కూడా రెండో సగం లాగ దర్శకుడు చెప్తుంటే శ్రీవిష్ణుకి మరో మంచి సినిమా అయ్యేది.

Read Also : మహేష్ తో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

నటినటులు పనితీరు:
శ్రీవిష్ణు నటన గురించి చెప్పేదేముంటది. ఈ తరంలో ఇండస్ట్రీకి దొరికిన అద్భుత నటుడు. ఈ సినిమా లో వివిధ గెటప్స్ లో కనిపించి ప్రతి పాత్రకి వైవిద్యం చూపించాడు. బవభూతి డైలాగ్ యాస ఒక దగ్గరికి వచ్చేసరికి ప్రేక్షకుడికి చిరాకు పుట్టించిద్ది. స్వాగనికి రాజు, సింగ పత్రాలు శ్రీ విష్ణుకి కొట్టిన పిండే. ఈ సినిమా కోసం శ్రీవిష్ణు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
హీరోయిన్ రీతూ వర్మ కూడా మల్టిపుల్ రోల్స్ లో కనిపించింది కానీ కథలో ఉన్న గందరగోళం వల్లనేమో పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా లో కనిపించిన మీరా జాస్మిన్ పాత్ర తన నటన ఆకట్టుకుంటుంది. ఇక సినిమా లో చేసిన మిగతా పాత్రలు దక్షా నాగర్కర్ జాస్మిన్, , శరణ్య, సునీల్, రవిబాబు, గెట్ అప్ శ్రీను తధితరులు వాళ్ళ పాత్రల మెరకు నటించారు.

టెక్నికల్ టీమ్ లో సినిమాటోగ్రఫీ, సంగీతం చక్కగా ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకి కావాల్సిన మేరకు ఖర్చు పెట్టరు నిర్మాతలు. దర్శకుడు హాసిత్ గోలీ చక్కటి కథ , మాటలు, నేపధ్యం రాసుకున్నా స్క్రీన్ ప్లే విషయం లో ప్రేక్షకుడిని గందరగోళం లో పడేసాడు.

చివరిగా
స్వాగ్: ప్రేక్షకుడిని తన స్వాగ్ తో గందరగోళానికి గురి చేసాడు దర్శకుడు….
Filmy Bowl Rating : 2.5/5

Follow us on Instagram

Related posts

సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

Leave a Comment