సందీప్ రెడ్డి వంగా..ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఈ పేరు సంచలనంగా మారింది.. తీసింది మూడు సినిమాలే కానీ ఆ మూడు సినిమాల ఇంపాక్ట్ మాత్రం పాన్ ఇండియా వైడ్ బాగా కనిపించింది.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన దర్శకుడిగా సందీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ అరాచకం సృష్టించాడు.. యానిమల్ సినిమాలో సందీప్ వైలెన్స్ కి సరికొత్త అర్ధం చెప్పాడు.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది..
హరిహర వీరమల్లు : “కొల్లగొట్టినాదిరో” ప్రోమో అదిరిందిగా..!!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “స్పిరిట్” అనే మరో పవర్ ఫుల్ మూవీ చేసేందుకు సందీప్ సిద్ధమవుతున్నాడు..ప్రభాస్ ని ఇంతవరకు ఎవరూ చూపించని వైల్డ్ క్యారెక్టర్ లో సందీప్ ప్రెజెంట్ చేయనున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ “కాప్” గా నటించనున్నాడు..ప్రభాస్ కి తన కెరియర్లో గుర్తుండిపోయే ఇండస్ట్రీ హిట్ ను ఇవ్వాలని సందీప్ ప్రయత్నిస్తున్నాడు..దీనిలో భాగంగా స్పిరిట్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను విలన్స్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విశాల్ కాగా, మరొకరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ అని సమాచారం..
గోపీచంద్ ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్.. అంతే కాదు గతంలో ప్రభాస్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు.. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నానని సమాచారం.. దీనితో సందీప్ గోపీచంద్ ని ఫిక్స్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..అలాగే తమిళ్ స్టార్ హీరోగా వున్న విశాల్ సైతం విలన్ రోల్ లో కరెక్ట్ గా సరిపోతాడు.. దీనితో సందీప్ ఈ ఇద్దరి హీరోలని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.