MOVIE NEWS

స్పిరిట్ : టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు “సలార్” సినిమా భారీ ఊరటనిచ్చింది.. ఈ ఏడాది ప్రభాస్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కించిన “కల్కి 2898AD” సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ప్రభాస్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ప్రభాస్ కెరీర్ లో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే ఉన్నాయి. వాటిలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’..

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..ఇండియా హిస్టరీలోనే తొలిసారిగా..!!

యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ కాప్ గా నటిస్తున్నాడు.. తన సినిమాల్లో హీరోలని వైల్డ్ గా చూపించే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని కూడా మరింత వైల్డ్ గా చూపించబోతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసేపనిలో వున్నాడు సందీప్ రెడ్డి వంగా.. తన సినిమాలో హీరో క్యారెక్టర్స్ కి ధీటైనా విలన్ పాత్రలను సృష్టించడం సందీప్ రెడ్డి అలవాటు. ప్రభాస్ సినిమాలో కూడా పవర్ఫుల్ విలన్ పాత్రను సందీప్ రెడ్డి వంగా సృష్టించాడు.. ఈ పాత్రకు కొరియన్ సూపర్ స్టార్ “డాన్ లీ” ని ఎంచుకోవడం జరిగింది.. ‘డాన్ లీ’ ఎవరో తెలియాలంటే ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్లి అతని సినిమాల్లోని కొన్ని యాక్షన్ సీన్స్ చూస్తే తెలుస్తుంది. గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంటాయి.

ప్రభాస్ కంటే ఎంతో పవర్ ఫుల్ గా కనిపించే ఈ వ్యక్తి స్పిరిట్ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు అనే న్యూస్ తెలీగానే అభిమానులు అతనిని సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ చేస్తున్నారు.. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం.దీనితో ఈ సినిమాపై భారీగా హైప్ ఏర్పడింది.. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ వంగ, ఈ చిత్రానికి సంబంధించిన ఒక సెన్సేషనల్ అప్డేట్ ని ఇచ్చాడు.ఈ సంక్రాంతికి ‘స్పిరిట్’ మూవీ నుండి అభిమానులకు ఏదైనా అప్డేట్ ఇవ్వబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు సందీప్ సమాధానం చెప్తూ కచ్చితంగా ఇస్తున్నాం ..త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని తెలిపారు.. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. సంక్రాంతి కానుకగా స్పిరిట్ మూవీ నుంచి మేకర్స్ టీజర్ లాంచ్ చేయనన్నట్లు సమాచారం..

Related posts

“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..!

murali

గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..?

murali

ఆ భాషలో ఎప్పటికీ నటించను.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment