MOVIE NEWS

స్పిరిట్ : ప్రభాస్ సినిమాలో ఆ స్టార్ హీరో.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో ‘స్పిరిట్’ మూవీ ఒకటి.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ ఉగాది సందర్భంగా మొదలు కానున్నట్లు సమాచారం… ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశాడు.అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!!

ఈ క్రమంలో సందీప్ స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది… ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు మరోక స్టార్ హీరో కూడా నటిస్తున్నాడు. గతేడాది మహారాజతో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పిరిట్ లో నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇటీవల విజయ్ సేతుపతిని కలిసి కథ వినిపించగా అందుకు సేతుపతి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడట.

అలాగే విజయ సేతుపతి ఈ సినిమాలో ప్రభాస్ కు ధీటుగా పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు అని సమాచారం. సినిమాను మొత్తం 120 రోజుల వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసేలా సందీప్ ప్లాన్ చేస్తున్నాడు.సందీప్ వంగా ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటేనే అంచనాలు ఓ రేంజ్ కు చేరుకున్నాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి వచ్చి చేరడంతో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

 

Related posts

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

murali

షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!!

murali

వెంకీ మామ గోయింగ్ బ్యాక్….

filmybowl

Leave a Comment