పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు..దానితో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఫౌజీ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ స్పిరిట్ “.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..
SSMB : మహేష్ మూవీ సవాలుగా తీసుకున్నా.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.. సందీప్ వంగ సినిమాల్లో హీరో పాత్రకి సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది..యాటిట్యూడ్ కా బాప్ అనిపించేలా సందీప్ హీరోల క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తాడు..అలాగే సందీప్ వంగా తన సినిమాల్లో విలన్ రోల్ కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తారు..
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ కి అన్నయ్యగా నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడని టాక్. అయితే ప్రభాస్ పాత్ర హై ఓల్టేజ్ యాక్షన్ తో చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం..