పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు..దానితో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఫౌజీ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ స్పిరిట్ “.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..
Mega 157 : గ్రాండ్ గా పూజా కార్యక్రమం.. వీడియో వైరల్..!!
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. సందీప్ ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ హైప్ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి సందీప్ రెడ్డి భారీ అప్ డేట్ ఇచ్చాడు.ఈ మూవీ కోసం మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు తెలిపాడు. త్వరలోనే అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు…
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగులు అయిపోయే సమయానికి స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది..