పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కల్కి 2898AD” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది..ఈ సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు.. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ప్రభాస్ మారుతీ సినిమా తరువాత యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.అలాగే హనుమ రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా సెట్స్ మీద నేపధ్యం లో తన తదుపరి సినిమాని సందీప్ వంగతో చేయడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడు.
ఎస్ఎస్ఎంబి : బిజీఎం కోసం రంగంలోకి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!
అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న “స్పిరిట్” సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా స్టోరీ ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ మూగవాడిగా నటించబోతున్నాడనే వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది తెలుసుకున్న చాలామంది ప్రభాస్ అభిమానులు సందీప్ రెడ్డి వంగ తమ హీరోని మూగవాడిగా చూపిస్తున్నాడా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే సినిమా మొత్తం ప్రభాస్ మూగవాడిగా నటించడని సమాచారం.ఆయన అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా ఒక ఐదు నిమిషాల పాటు మూగవాడి గా నటిస్తాడని సమాచారం. పవర్ ఫుల్ కాప్ గా ప్రభాస్ నట విశ్వరూపం చూస్తారని సందీప్ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే..