పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో ‘స్పిరిట్’ మూవీ ఒకటి.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధం అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు.అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ క్రమంలో సందీప్ స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.
బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..?
అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దాని పై చాలా రోజులుగా చర్చ నడుస్తూ ఉంది. సౌత్ కొరియా నటుడు ‘డాంగ్ లీ’ విలన్‌గా నటించబోతున్నట్టుగా ఓ న్యూస్ గతంలో బాగా వైరల్ అయింది. డాంగ్ లీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ ‘సలార్’ పోస్టర్‌ని షేర్ చేయడంతో ‘స్పిరిట్’ విలన్ ఆయనే అని అంతా ఫిక్స్ అయ్యారు.ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్ విలన్ అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది..ఈ వార్తలపై స్పిరిట్ మేకర్స్ ను సంప్రదించగా ఆ వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదని తెలిసింది. వరుణ్ తేజ్ విలన్ అనే డిస్కషన్ అస్సలు జరగలేదని అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసారు.
ఇక ఈ సినిమాను సమ్మర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్న సందీప్ ఫస్ట్ షెడ్యూల్‌ని ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం..ఇప్పటికే సందీప్ జకార్తాలో లొకేషన్ చూసిన సందీప్ మరోసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో జకార్తా వెళ్లి లొకేషన్స్ ఫైనల్ చేయనున్నాడని సమాచారం..