టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నాయి.
ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!!
ఇందులోప్రభాస్ సరసన హీరోయిన్ ఎవరు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి దీపిక పలు కండీషన్‌లు పెట్టిందని సమాచారం.. ఆ కండిషన్స్ ఏమిటంటే..తెలుగు డబ్బింగ్ చెప్పననడం, 40 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం, సినిమా లాభాల్లో వాటా కోరడం వంటి నిబంధనల కారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆమెను వద్దనుకున్నారు..ఊహించని విధంగా నేడు (శనివారం)సందీప్‌రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
`స్పిరిట్` మూవీలో `యానిమల్` ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నా సినిమాలో ఫిమేల్ లీడ్ ని అఫీషియల్‌గా ప్రకటిస్తున్నానని త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు.దీంతో ఇన్ని రోజులుగా `స్పిరిట్`లో ప్రభాస్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ కి తెర పడింది. ఇదిలా ఉంటే `స్పిరిట్`లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని మొత్తం తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ స్పిరిట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.